AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో అదరగొడుతున్న 'ప్రెడెటర్ బ్యాడ్ ల్యాండ్స్‌

ఇండియాలో అదరగొడుతున్న ‘ప్రెడెటర్ బ్యాడ్ ల్యాండ్స్‌

Phani CH
|

Updated on: Nov 09, 2025 | 4:28 PM

Share

ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలోనూ అద్భుతమైన స్పందన పొందుతోంది. ఇది సైన్స్ ఫిక్షన్ యాక్షన్, ఎమోషన్, కామెడీల సమ్మేళనం. డెన్ ట్రాక్‌టెన్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, యాక్షన్, విజువల్స్, మానవ సంబంధాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ, ప్రెడేటర్ ఫ్రాంచైజీకి కొత్త ఉత్సాహాన్నిస్తోంది.

ప్రెడెటర్ సినిమాలకు విదేశాల్లో మాత్రమే కాదు మన దేశాల్లో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలు రిలీజ్‌ అయితే చాలు థియేటర్స్‌కు వెళ్లి మరీ చూస్తారు. గూస్ బంప్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ను విట్‌నెస్ చేస్తారు. ఈ క్రమంలోనే ప్రెడెటర్ ఫ్రాంచైజ్‌లో లేటెస్ట్‌ గా రిలీజ్ అయిన ప్రెడెటర్‌ బ్యాండ్‌ లాండ్స్‌ సినిమా కూడా ఇప్పుడు ఆలోవర్ వరల్డ్‌ అదరగొడుతోంది. ఇండియాలోనూ మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ప్రెడెటర్ ఫ్రాంచైజీలో తొమ్మిదవ ఇన్‌స్టాల్మెంట్‌గా.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ బ్యాక్రౌండ్‌లో తెరకెక్కిన ప్రెడెటర్ బ్యాడ్‌ లాండ్‌కి డైరెక్టర్ డాన్ ట్రాక్‌టెన్‌ బర్గ్‌. ఎల్లా ఫాన్నింగ్ అండ్ డిమిట్రియస్ ఈ సినిమాలో లీడ్ చేశారు. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ఎట్ ప్రజెంట్ వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. బ్యాడ్‌లాండ్స్ సినిమాలో.. రక్తపాతం, హంటింగ్ ఎలిమెంట్స్‌ మాత్రమే కాకుండా యాక్షన్‌, సై-ఫై, మానవ సంబంధాలు, కామెడీతో ఎలిమెంట్స్‌ కూడా ఉండడంతో.. ఈ మూవీ ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేస్తోంది. దిమ్మతిరిగే యాక్షన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, టాప్‌ నాచ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఉండడంతో… ఈ సినిమాకు కలిసొస్తుంది. జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్, క్రియేటివ్ స్టైల్‌లో డిజైన్ చేసిన యుద్ధ సన్నివేశాలు అదిరిపోయాయి. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా ఉండడం అడిషనల్ బోనస్. డెక్ తన తండ్రి అప్రూవల్ కోసం, తన తమ్ముడు క్వేయ్ కోసం చేసే ఫైట్..అండ్ ఎమోషనల్ సీన్స్ ఇండియన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవడంతో.. ఈ మూవీ ఇండియాలోనూ మంచి రెస్పాన్స్‌ రాబట్టుకుంటోంది. ఇక డెక్‌కి సపోర్ట్‌గా ఉన్న టాకేటివ్ సింథెటిక్ థియా, చిన్న ఏలియన్ బడ్‌తో కలసి వచ్చే కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. మొత్తానికి హాలీవుడ్ సినిమా ప్రెడేటర్ : బ్యాడ్‌ల్యాండ్స్ యాక్షన్, ఎమోషన్, హ్యూమర్, థ్రిల్ తో.. వీటితోపాటు మాస్ సినిమాలా ఎలిమెంట్స్‌తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఒక్క సీరియల్‌కే కోటికి పైగా సంపాదన హాట్‌ టాపిక్‌గా వంటలక్క ఫీజ్‌

చనిపోయిన తండ్రి జ్ఞాపకాలు మరవలేక

నవంబరులో నింగిలో అన్నీ అద్భుతాలే

సుడిగాడు.. కొంచెం ఉంటే బస్సు చక్రాల కిందే

ఈజిప్టు మమ్మీల శాపం నిజమైందా