AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీసెంట్ టైమ్స్‌లో బాగా భయపెట్టే సినిమా ఇదే! హిట్టా..? ఫట్టా..?

రీసెంట్ టైమ్స్‌లో బాగా భయపెట్టే సినిమా ఇదే! హిట్టా..? ఫట్టా..?

Phani CH
|

Updated on: Nov 09, 2025 | 4:39 PM

Share

ప్రణవ్ మోహన్ లాల్ నటించిన 'డీయస్ ఈరే' తెలుగులో విడుదలైంది. ఒక ఆత్మ వెంటాడటం, దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడం ప్రధానాంశం. ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్, సస్పెన్స్‌తో కూడిన ఇన్వెస్టిగేషన్‌తో ఆకట్టుకుంటుంది. క్రిస్టో గ్జేవియర్ నేపథ్య సంగీతం భయపెట్టే సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ హారర్ మూవీగా నిలిచే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్.. పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతుండగా.. మరో స్టార్ హీరో మోహన్ లాల్ కొడుక మాత్రం.. వెర్సటైల్ కథలను ఎంచుకుంటూ.. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్‌ చేసుకుంటున్నాడు. ఈక్రమంలోనే మోహన్ లాల్ సన్ ప్రణవ్‌ మోహన్ లాల్‌ ‘డీయస్ ఈరే’ అనే హార్రర్ సినిమా చేశాడు. అక్టోబర్ 31న మలయాళంలో రిలీజ్ అయిన అందర్నీ భయపెట్టిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను కూడా భయపెడుతుందా? లేదా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.! ఇన్‌ షార్ట్‌ గా.. డీయస్ ఈరే మూవీ కథలోకి వెళితే.. రోహన్ అలియాస్ ప్రణవ్ మోహన్ లాల్ బాగా డబ్బున్న వ్యక్తి కొడుకు. ఓ పెద్ద ఇంట్లో సింగిల్ గా ఉంటూ ఫ్రెండ్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తన స్కూల్ మేట్ కని అలియాస్ సుస్మిత భట్ చనిపోయింది అని తెలియడంతో రోహన్, అతని ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్లి పరామర్శిస్తారు. రోహన్ – కనికి గతంలో రిలేషన్ ఉండి, వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. కని వాళ్ళింటికి వెళ్లిన రోహన్ అక్కడ్నుంచి కని హెయిర్ క్లిప్ ఒకటి తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పట్నుంచి కని ఆత్మ రోహన్ ని వెంటాడుతుంది, కొడుతుంది, భయపెడుతుంది. ఈ విషయాన్ని రోహన్.., కని ఇంటి పక్కనే ఉండే మధు అలియాస్ గిబిన్ గోపినాథ్‌కు చెప్తాడు. ఈ క్రమంలోనే ఓ రోజు కని తమ్ముడు రోహన్ ఇంటికి వస్తే ఆ ఆత్మ అతన్ని కూడా మేడ మీద నుంచి కిందకు పడేస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలతో అది కని ఆత్మ కాదు ఒక అబ్బాయి ఆత్మ అని అందరికీ అర్ధమవుతుంది. దీంతో రోహన్, మధు అసలు ఆ ఆత్మ ఎరితో తెలుసుకునే పని మొదలెడతారు. దాంతోపాటే కని లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? కని రూమ్ లో కొన్ని వస్తువులు ఎలా మిస్ అయ్యాయి? అవి ఎక్కడికి వెళ్లాయి అని వెతకడం మొదలు పెడతారు. మరి రోహన్ ని ఇబ్బంది పెట్టె ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ ఎందుకు రోహన్ ని ఇబ్బంది పెడుతుంది? కని ఎందుకు చనిపోయింది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. రీసెంట్ టైమ్స్ లో మంచి ఫుల్ లెంగ్త్ హారర్ సినిమాలు తక్కువగా వస్తున్నాయి. కానీ ఈ ‘డీయస్ ఈరే’ మూవీ అలా కాదు. రీసెంట్‌ టైమ్స్‌లో బెస్ట్ హారర్ ఈ మూవీని చెప్పొచ్చు. ఫస్ట్ 20 నిముషాలు కథ సింపుల్ గా సాగిపోతుంది. రోహన్ కని హెయిర్ క్లిప్ తెచ్చిన దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి ప్రతీ సీన్ తో భయపెడతారు. హారర్ మాత్రమే కాకుండా ఈ ఆత్మ ఎవరిది అనే ఇన్వెస్టిగేషన్ కూడా సస్పెన్స్ తో చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఇంకా ఆసక్తిగా మారుతుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది అని తెలిసిన తర్వాత అంతా ఆశ్చర్యపోతారు. క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. సగం సినిమాను ఓ ఇంట్లోనే చుట్టేసినా కూడా.. హర్రర్ ఎలిమింట్స్‌తో సినిమాను గ్రిప్పింగా నడిపించాడు డైరెక్టర్. హర్రర్ ఎలిమెంట్స్ ఎంత బలంగా ఉన్నాయంటే.. థియేటర్లో ఎవ్వరు చూసినా.. ఖచ్చితంగా భయపడిపోతారు. ఆ రేంజ్‌లో సీన్స్‌ను డిజైన్ చేశాడు. హర్రర్ సినిమాలను నిలబెట్టేది బ్యూక్ గ్రౌండ్ మ్యూజిక్కే .. ఈ విషయంలో .. మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గ్జేవియర్ అదరగొట్టాడు. తన మ్యాజిక్‌తో హర్రర్‌ సీన్స్‌ను ఎలివేట్ చేశాడు. అయితే అసలు కని ఎందుకు చనిపోయింది అని క్లారిటీ ఇవ్వలేదు. చివర్లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు కాబట్టి అందులో చెప్తారేమో చూడాలి. ఇక ఫైనల్‌గా ‘డీయస్ ఈరే’ అంటే అర్థం… తన కోపం చూపించే ఒక రోజు. ఇదొక లాటిన్ పదం. ఆత్మ తన కోపం చూపించింది అనే అర్థంలో ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టారు డైరెక్టర్ రాహుల్‌ సదాసివన్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజ్ నిడిమోరుకు సమంత క్లోజ్ హగ్ కొత్త ప్రయాణం మొదలైందా

ఇండియాలో అదరగొడుతున్న ‘ప్రెడెటర్ బ్యాడ్ ల్యాండ్స్‌

ఆ ఒక్క సీరియల్‌కే కోటికి పైగా సంపాదన హాట్‌ టాపిక్‌గా వంటలక్క ఫీజ్‌

చనిపోయిన తండ్రి జ్ఞాపకాలు మరవలేక

నవంబరులో నింగిలో అన్నీ అద్భుతాలే