Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైఫ్‌ పార్ట్‌నర్‌పై సమంత సంచలన పోస్ట్..వీడియో

లైఫ్‌ పార్ట్‌నర్‌పై సమంత సంచలన పోస్ట్..వీడియో

Samatha J

|

Updated on: Feb 19, 2025 | 5:51 PM

సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ జనాల్లో అది హాట్ టాపికే. సమంతతో విడాకులకు గల కారణాలు ఇప్పటికీ వారి అభిమానులలో చర్చించుకునేలా చేస్తున్నాయి. 2019లో సమంత చేసిన కొన్ని కామెంట్స్ వాలంటైన్స్ డే రోజున వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తాను నాగ చైతన్య మొదటి భార్యను కాదు అనేసింది సమంత. నాగ చైతన్య మొదటి భార్య తన దిండే అని చెబుతూ సరదాగా నవ్వేసింది. మా ఇద్దరి మధ్య ప్రతీ రాత్రి ఒక దిండు ఉంటుందని చెప్పింది. ఇక సామ్ తాజాగా తన ఇన్స్టా స్టోరీలో రిలేషన్ షిప్ గురించి షేర్ చేసిన ఓ సందేశాత్మక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. మళ్ళీ బ్యాక్ టూ ఫామ్ లోకి వచ్చారు.

సినిమా షూటింగ్స్ రెగ్యులర్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే సిటాడెల్ హన్నీ బన్నీ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సీరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. మరోవైపు తన సొంత ప్రొడక్షన్ లో ఓ సినిమా కూడా స్టార్ట్ చేశారు సామ్. సమంత తరచూ సోషల్ మీడియాలో తన వ్యక్తిగతం, ఆరోగ్యం, సినిమాలకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు కొన్ని సందేశాత్మక కొటేషన్ లు, వీడియోలను కూడా పంచుకుంటుంటారు. సామ్… భార్యాభర్తల బంధంపై తాజాగా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు మీ భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉండవచ్చు. మంచి బంధం నిజమైన ప్రేమ అన్ని రకాల సామర్థ్యాల్ని కలిగి ఉంటుంది. కానీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే.. మీ భాగస్వామి కోరుకున్న విధంగా కనిపించలేరు. ఎదుటి వ్యక్తి చక్కగా ఉన్నారని అనుకుంటాం.. కానీ మన మనసు, శరీరం ఎలా ఉంది అనేది గుర్తించం. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తిని కోల్పోవాల్సిందే అని ఆమె షేర్ చేసిన వీడియోలోని సందేశం.