గతం గురించి ఓపెన్‌ అయిన సమంత.. నేను తప్పులు చేశానంటూ వీడియో

Updated on: Oct 20, 2025 | 11:01 AM

నటి సమంత రుత్ ప్రభు తన గతం గురించి ఇటీవల ఓపెన్ అయ్యారు. తన జీవితంలో జరిగిన సంఘటనలు, తప్పులు, విడాకులు, ఆరోగ్య సమస్యలు, సోషల్ మీడియా ట్రోల్స్‌ను గుర్తు చేసుకున్నారు. ఊ అంటావా పాట ఛాలెంజ్‌ను కూడా వివరించిన సమంత, ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్‌ల గురించి తెలిపారు.

స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి నిర్మొహమాటంగా మాట్లాడారు. తాను పరిపూర్ణరాలును కానని, తప్పులు చేశానని, దెబ్బలు తిన్నానని ఆమె అంగీకరించారు. అయితే, ఇప్పుడు మెరుగవుతున్నానని చెప్పారు. తన జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన ప్రజల సమక్షంలోనే జరిగిందని, విడాకులు, ఆరోగ్య సమస్యల వంటి సందర్భాలలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సోషల్ మీడియా ట్రోల్స్ తనను ఎంతగానో వేధించాయని, కొందరు తన వ్యక్తిత్వంపై తీర్పులు కూడా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

హైదరాబాద్‌ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్‌ వీడియో

ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా

డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో