Samantha: ఆ క్షణాలను ఎంజాయ్‌ చేయలేకపోయాను.! అందుకే అలా చేశాను.

|

Mar 18, 2024 | 4:13 PM

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా దాదాపు 14 ఏళ్లు సినీ కెరీర్‌ పూర్తిచేసుకున్నారు సమంత. ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు సమంత. అనారోగ్యం కారణంగా యాక్టింగ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్న సమంత ఇప్పడిప్పుడే మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పలు వేదికలపై ఇంటర్వ్యూలు ఇస్తూ అభిమానులకు మళ్లీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా దాదాపు 14 ఏళ్లు సినీ కెరీర్‌ పూర్తిచేసుకున్నారు సమంత. ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు సమంత. అనారోగ్యం కారణంగా యాక్టింగ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్న సమంత ఇప్పడిప్పుడే మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పలు వేదికలపై ఇంటర్వ్యూలు ఇస్తూ అభిమానులకు మళ్లీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిరోజూ 10 రకాలు పనులు చేస్తానని, ఐదు గంటల పాటు మాత్రమే నిద్రపోతానని తెలిపారు. 14 ఏళ్ల సినీ కెరీర్‌లో తన శరీరం, మనసుకు ఎలాంటి బ్రేక్‌ ఇవ్వలేదని వివరించారు. ఆ పద్నాలుగేళ్లలో కొన్ని బాధపడిన సంవత్సరాలున్నాయని తెలిపారు. ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌తో ఇబ్బందిపడిన క్షణాలున్నాయని తెలిపిన సామ్‌.. ఈ సిండ్రోమ్‌ కారణంగా.. కెరీర్‌ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్‌ చేయలేకపోయానన్నారు. విజయం సాధించినా అది తన వల్ల వచ్చింది కాదని.. వేరేవారి వల్ల వచ్చిందని భావించేదాన్నని సమంత తెలిపారు.

మయోసైటిస్‌ కారణంగా గతంలో తాను నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ (యశోద) ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని..ఆ సమయంలో చాలా రూమర్స్ వచ్చాయని, అవన్నీ తట్టుకోలేకపోయానని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో తన వ్యాధి గురించి బయటపెట్టాల్సి వచ్చిందని వివరించారు. యశోద సినిమా తరువాత ప్రయోషన్స్ చేయకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడంతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చానని, ఆ తరువాత ట్రీట్‌మెంట్‌ కోసం ఇంట్లోనే ఉండిపోయానని వివరించారు సమంత.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..