Sai Pallavi – Junaid Khan: బాలీవుడ్‌ స్టార్ హీరో కొడుకుతో.. హంగామా చేస్తున్న సాయి పల్లవి.

Updated on: Feb 14, 2024 | 5:05 PM

ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుంది న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి. డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోపాటు సాయి పల్లవి హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుంది న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి. డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోపాటు సాయి పల్లవి హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఆమె హిందీలో ఓ మూవీ చేయనుందని.. అది కూడా ఓ స్టార్ హీరో తనయుడి జోడిగా కనిపించనుందని రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా న్యాచురల్ బ్యూటీ బాలీవుడ్ మూవీపై క్లారిటీ వచ్చేసింది.

అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అతని మొదటి సినిమా ‘మహారాజ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం జపాన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ విరామంలో సాయి పల్లవి, జునైద్ ఖాన్ కలిసి అక్కడి మంచు పండగలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవ్వడమే కాదు.. బాలీవుడ్‌లో క్రేజీ బజ్‌ ను క్రియేట్ చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..