RGV – Vyuham : రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోన్న ఆర్జీవీ వ్యూహం సినిమా.. అన్ని నిజాలేనా..?

|

Jun 03, 2023 | 8:38 AM

రామ్‌గోపాల్‌వర్మ... ఈ పేరే పెద్ద కాంట్రవర్సీ... ఎప్పుడేం చేస్తాడో... ఏమంటాడో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ మీద కాంట్రవర్సీ లేపవడం వర్మ స్టైల్‌. ఒక్క మాటలో చెప్పాలంటే లోకమంతా ఒకవైపు ఉంటే... ఆర్జీవీ ఒక్కటే ఇంకోవైపు ఉంటాడు.

రామ్‌గోపాల్‌వర్మ… ఈ పేరే పెద్ద కాంట్రవర్సీ… ఎప్పుడేం చేస్తాడో… ఏమంటాడో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ మీద కాంట్రవర్సీ లేపవడం వర్మ స్టైల్‌. ఒక్క మాటలో చెప్పాలంటే లోకమంతా ఒకవైపు ఉంటే… ఆర్జీవీ ఒక్కటే ఇంకోవైపు ఉంటాడు. అయినా, అందరూ చేసేదే ఆర్జీవీ చేస్తే ఆయన రాంగోపాలవర్మ ఎందుకవుతారు? పొగరనుకున్నా, తెగువనుకున్నా డోంట్‌ కేర్‌ అనే వర్మ… ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కల్లోలం రేపారు. వ్యూహం పేరుతో కొత్త సినిమాను అనౌన్స్‌చేసి షూటింగ్‌ కూడా మొదలుపెట్టేశారు ఆర్జీవీ. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలోకి వదిలారు. ఇప్పుడీ ఫొటోలు సంచలనంగా మారాయ్‌. ఎందుకంటే, అవి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి పాత్రలు. సీఎం జగన్‌గా అజ్మల్‌ నటిస్తుంటే… భారతి క్యారెక్టర్‌ను మానస పోషిస్తోంది. సినిమాలోని క్యారెక్టర్స్‌తోపాటు స్టోరీ లైన్‌ కూడా ముందే చెప్పేశారు వర్మ. అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం అంటూ మూవీ ఎలా ఉండబోతోందో ముందే హింట్‌ ఇచ్చారు. ఆర్జీవీ అనౌన్స్‌ చేసిన వ్యూహం మూవీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్‌ రేపుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.