రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అందులో మధురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తీక్ కూడా ఒకరు. సైనికుడిగా సరిహద్దులో సేవలందించి రిటైరైన అతనికి రజనీకాంత్ అంటే చెప్పలేని అభిమానం. తన ఫేవరెట్ హీరోకు మనసులో గుడి కట్టేసుకున్న కార్తీక్ ఇటీవలే ఏకంగా తన ఇంట్లోనూ గుడి కట్టేశాడు.
అంతేకాకుండా రజనీ విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. ఇప్పుడీ విషయం సూపర్ స్టార్ రజనీ కాంత్ దాకా వెళ్లింది. ఈ విషయం తెలిసిన ఆయన తనకు గుడి కట్టించిన వీరాభిమాని కార్తీక్ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్ గార్డెన్లోని తన ఇంటికి పిలిపించారు. తన అభిమాని కుటుంబంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అలాగే బాబా విగ్రహాన్ని కానుకగా తన అభిమానికి అందించారు రజినీకాంత్. చివరిగా వారికి రుచికరమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీనిని చూసిన రజనీకాంత్ అభిమానులు తమ హీరోతో పాటు కార్తీక్ పైనా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్ని కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఆఖరికి ఎడ్ల బండితో లాగాల్సి వచ్చింది
లాటరీ చరిత్రను తిరగరాసే ఘటన.. రూ.10 వేల కోట్ల జాక్‌పాట్ టిక్కెట్ అమ్మకం !!