Renu Desai: రేణు ఇంట తీవ్ర విషాదం !! దుఃఖంలో అకీరా తల్లి
ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్య కారణాలతో రేణు దేశాయ్ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయే.. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అందరితో పంచుకున్నారు. తన తల్లికి సంబంధించిన పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు ఫోటోతో పాటే.. ఆది శంకరాచార్యుల శ్లోకాన్ని ఆ ఫోటో కింద రాసుకొచ్చారు.
పునరపి జననం పునరపి మరణం.. పునరపి జననీ జఠరే శయనం.. ఇహ సంసారే బహుదుస్తారే.. కృపయాపారే పాహి మురారే..! పుట్టడం,చావడం.. ఓ తల్లి గర్భంలో జన్మించడం.. ఇదొక అంతే లేని.. దాటలేని జీవన సముద్రం. అని తన పోస్ట్‌లో కోట్ చేశారు రేణు దేశాయ్. ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఆమె ఫ్యాన్స్ ను ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ తల్లికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. రేణూ దేశాయ్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రాంగ్ గా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos