తెలియకపోతే చెప్పాలి కానీ.. ఇదేంటి !! చరణ్ వివాదంపై మనోహర్ దాస్ కామెంట్స్
సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉండే మెగా హీరో రామ్ చరణ్ ఇటీవల కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే దర్గాకు సమీపంలో ఉన్న విజయ దుర్గ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తదుపరి సినిమా స్క్రిప్టును అమ్మవారి పాదాల దగ్గర ఉంచి దీవెనలు తీసుకున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా అయ్యప్ప స్వామి మాలలో ఉంటోన్న రామ్ చరణ్ కడప దర్గాను దర్శించుకోవడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మెగా హీరో వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో రామ్ చరణ్ పై వస్తోన్న విమర్శలకు ఇప్పటికే అతని సతీమణి ఉపాసన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్ రామ్ చరణ్ కు అండగా నిలిచారు. రామ్ చరణ్ నిజమైన భక్తుడు… శివాలయాన్ని శుభ్రం చేసాడు… తన కూతురికి కూడా క్లీంకార అనే పేరు పెట్టాడు… ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం విదేశాలకు వెళ్లినపుడు వెంట రాముల వారిని కూడా తీసుకెళ్లాడు… మీలో ఎవరికైనా రామ్ చరణ్ తప్పు చేసినట్లు అనిపిస్తే నా దగ్గరికి రండి.. తీరిగ్గా కూర్చొని మాట్లాడుదాం… అంటూ రామ్ చరణ్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంతేకాదు ఎవరో పిలిచారని అతను దర్గాకు వెళ్లాడని.. అతనికి తెలియకపోతే మనం చెప్పాలి అంతే కానీ చరణ్ గురించి తప్పుగా ప్రచారం చేయవద్దు అంటూ చెర్రీ పై విమర్శలు చేస్తున్న వారికి సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: