Raviteja Dhamaka: 100 కోట్ల మాస్ రాజా..! దుమ్ములేపిన మాస్ ధమాకా.. రికార్డు బ్రేక్స్ అంతే..
చూస్తుండగానే మాస్ మహారాజ్ 100 కోట్లు కొల్లగొట్టారు. తన కెరీర్లోనే గోల పెట్టేంత హిట్‌ను పట్టేసుకున్నాడు. ధమాకా సినిమాతో.. ధామాకాదార్ కలెక్షన్స్ అంటే ఇవీ అనే టాక్ రాబట్టుకున్నారు.
చూస్తుండగానే మాస్ మహారాజ్ 100 కోట్లు కొల్లగొట్టారు. తన కెరీర్లోనే గోల పెట్టేంత హిట్‌ను పట్టేసుకున్నాడు. ధమాకా సినిమాతో.. ధామాకాదార్ కలెక్షన్స్ అంటే ఇవీ అనే టాక్ రాబట్టుకున్నారు. రాబట్టుకోవడమే కాదు.. తన అన్ బిలీవబుల్ కలెక్షన్లతో అందర్నీ షేక్ చేస్తున్నారు మన మాస్ రాజా.ఎస్ ! త్రినాథ రావ్ నక్కిన డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ధమాకా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో.. శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా.. తాజాగా రిలీజై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాదు.. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది.ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డేనే.. వరల్డ్ వైడ్ దాదాపు 10క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసిన ఈ సినిమా సెకండ్ డే.. అదే రేంజ్ లో కలెక్షన్స్ కుమ్మేసింది. దాదాపు 20 క్రోర్ గ్రాస్‌తో … రవితేజ కెరీర్లో లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టేసింది. అలా ఒక్కో రోజుకు 10 కోట్ల గ్రాస్ పెంచేసుకుంటూ.. ఇప్పుడు ఏకంగా అందర్నీ దిమ్మతిరిగే రేంజ్‌కు కలెక్షన్ ఫిగర్ ను సెట్ చేసుకుంది రవితేజాస్ ధమాకా. ఓవర్ ఆల్‌గా రెండు వారాల్లోనే వరల్డ్ వైడ్ 100క్రోర్ గ్రాస్ మార్క్‌ను టచ్ చేసింది. మాస్ రాజా కెరీర్లో నయా రికార్డును క్రియేట్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos