రెమ్యూనరేషన్ విషయంలో రూట్ మారుస్తున్న టాలీవుడ్ హీరోలు..

Edited By:

Updated on: Dec 29, 2025 | 5:13 PM

టాలీవుడ్‌లో హీరోలు పారితోషికం బదులు లాభాల్లో వాటా తీసుకునే కొత్త ధోరణి పెరుగుతోంది. నిర్మాతలకు భారీ రెమ్యునరేషన్ భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ మార్పు వస్తోంది. రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇది సినీ పరిశ్రమకు సానుకూల పరిణామంగా, కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలకు ప్రోత్సాహంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హీరోలు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంటే, నిర్మాతలు సినిమాలు చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలంటే, హీరోల్లో మార్పు రావాలి. వితౌట్‌ రెమ్యునరేషన్‌ సినిమాలు చేసి, లాభాల్లోనే వాటాలు తీసుకోవాలి… రీసెంట్‌గా కోలీవుడ్‌లో యమాగా హల్‌చల్‌ చేసిన స్టేట్‌మెంట్‌ ఇది. అక్కడ రాద్ధాంతం అయిన విషయాన్ని ఇక్కడ మనవాళ్లు సైలెంట్‌గా ఇంప్లిమెంట్‌ చేసేస్తున్నారా? అసలేం జరుగుతోంది. చేస్తున్న సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నప్పుడు హీరోల డెసిషన్‌ ఒకలా ఉంటుంది. అదే సినిమాలు వరుసగా విజయాలను చూస్తున్నప్పుడు మరోలా ఉంటుంది. రెమ్యునరేషన్‌ ఫ్యాన్సీగా ఉంటే, ఎలాంటి ప్రాజెక్ట్ అయినా ఆలోచించకుండా చేసేస్తారు రవితేజ… అనే మాటలు ఇక ఫిల్మ్ నగర్‌లో వినిపించవని అంటున్నారు జనాలు. అందుకు రీజన్‌.. ఆయన వితౌట్‌ రెమ్యునరేషన్‌ సినిమా చేయడమే. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కోసం రవితేజ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా రిలీజ్‌ అయ్యాక వచ్చే లాభాల్లో తీసుకుంటానని ముందే అగ్రిమెంట్‌ చేసుకున్నారట. అంతే కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలన్నది కూడా ఆయన పెట్టిన మేజర్‌ డిమాండ్‌ అనే మాటలున్నాయి. సో, ముందే అనుకున్నట్టు ప్లానింగ్‌ ప్రకారం రంగంలోకి దిగుతోంది భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాతో రవితేజ మాత్రమే కాదు, వారణాసితో మహేష్‌ కూడా వితౌట్‌ పే రూట్లోనే నడుస్తున్నారట. ఎంతైనా ఖర్చు చేయడానికి నిర్మాత వెనకాడకపోయినా, ముందు సినిమా చేద్దామని ఆఫ్టర్‌ రిలీజ్‌ పేమెంట్‌ అనే కాన్సెప్టుతో వారణాసి సెట్లోకి అడుగుపెట్టేశారట రాజమౌళి అండ్‌ మహేష్‌. కాన్సెప్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే, డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం.. లాభాల్లో తీసుకుందామని ముందుకు దూకే హీరోల సంఖ్య పెరగడం పాజిటివ్‌ వైబ్‌ అంటున్నారు క్రిటిక్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ

ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..

షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే