వెంకీ డైరక్షన్‌లో మాస్‌ మహరాజ్‌.. స్టోరీ రెడీయా ??

Edited By: Phani CH

Updated on: Oct 21, 2025 | 5:03 PM

సినిమా ప్రమోషన్ల టైమ్‌లో రకరకాల ఇంటర్వ్యూలు వస్తుంటాయి. అందులోనూ అరుదుగా మాట్లాడే మాస్‌ మహరాజ్‌ని క్లాస్‌ డైరక్టర్‌ వెంకీ అట్లూరి పలకరిస్తే సమాచారం మామూలుగా ఉంటుందా? సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్ రెడీగా లైన్లో నిలుచోకుండా ఉంటాయా? ఆ విశేషాలేంటో మనం కూడా చూసేద్దాం. రిలీజ్‌కి యమాగా రెడీ అవుతోంది మాస్‌ జాతర.

ఈ మూవీకి టైటిల్‌ పెట్టింది కూడా రవితేజనే. ఆయన్ని మాత్రం మాస్‌ మహరాజ్‌ అని లక్ష్యం మూవీ ఫంక్షన్‌లో సుమతో పిలిపించారట హరీష్‌ శంకర్‌. అప్పటి నుంచీ ఆ పేరు అలా ఉండిపోయిందని, ఇప్పుడు ఈ మూవీకి ఇది పర్ఫెక్ట్ టైటిల్‌ అని అన్నారు మాస్‌ మహరాజ్‌. వెంకీ డైరక్ట్ చేసిన సర్‌ మూవీ ఫస్ట్ రవితేజ నటించాల్సిందట. అయితే రవితేజ లైనప్‌ భారీగా ఉండటంతో ఈ మూవీ ధనుష్‌కి వెళ్లిందట. త్వరలోనే వీరి కాంబోలో సినిమా ఉంటుందని హింట్‌ ఇచ్చేశారు ఇద్దరూ. వెంకీకి రవితేజ ఇచ్చిన ఐడియా, రవితేజకు వెంకీ ఇచ్చిన ఐడియా.. రెండూ బావున్నాయట. సో.. సెన్సిబుల్‌ కథతో ఇద్దరూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అన్నమాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళి పార్టీ ఇచ్చిన బండ్ల గణేష్‌… కారణం ఉందా

Vishal: అవార్డులు చెత్తబుట్టలో వేస్తానన్న విశాల్‌.. అసలేమైంది

బక్కోడి ఖాతాలో బిగ్ హిట్ !! డ్రాగన్‌కు దిమ్మతిరిగే కలెక్షన్స్‌

డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌ అంటున్న ఫహాద్ ఫాజిల్‌

మీ ఓవర్ థింకింగ్‌ని తగ్గించే జపనీస్ టెక్నిక్స్ ఇవే