మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Updated on: Jan 17, 2026 | 2:46 PM

ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ల కెరీర్ ముగిసిందని భావించేవారు. కానీ రాణీ ముఖర్జీ మాత్రం ట్రెండ్‌ను మార్చారు. ఓటీటీలకు దూరంగా ఉంటూ, థియేట్రికల్ సినిమాలతో దూసుకుపోతున్నారు. హిచ్కి తర్వాత మర్దానీ సిరీస్‌తో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం మర్దానీ 3 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.

ఒకప్పుడు సీనియర్ హీరోయిన్‌ ట్యాగ్ వస్తే వారి కెరీర్‌ ముగిసినట్టేనని భావించే రోజులు పోయాయి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. హీరోయిన్లు తమ సీనియర్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టినా, సిల్వర్ స్క్రీన్ మీద తమ సత్తా చాటుకుంటున్నారు. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుత బాలీవుడ్‌లో చాలా మంది సీనియర్ తారలు ఓటీటీ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నప్పటికీ, రాణీ ముఖర్జీ మాత్రం ఈ ధోరణికి భిన్నంగా ఉన్నారు. ఆమె వరుస అవకాశాలను పరిగణించకుండా, కేవలం థియేట్రికల్ ఆఫర్లు వచ్చినప్పుడే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 2014లో వివాహం చేసుకుని కొంతకాలం విరామం తీసుకున్న రాణీ, 2018లో “హిచ్కి” సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో

ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?

యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్