AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya krishnan: శివగామికి చుక్కలు చూపించిన గాలి.. ఇదిలా ఉంటె రమ్యని ఇలా చుసిన కొంతమంది ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు..

Ramya krishnan: శివగామికి చుక్కలు చూపించిన గాలి.. ఇదిలా ఉంటె రమ్యని ఇలా చుసిన కొంతమంది ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు..

Anil kumar poka
|

Updated on: Aug 11, 2022 | 9:52 AM

Share

బాహుబలి సినిమాతో శివగామిగా.. త్రూ అవుట్ ఇండియాలో అందర్నీ గడగడలాండించిన రమ్యకృష్ణ... తాజాగా లైగర్ సినిమాతో మన ముందకు రాబోతున్నారు. పూరీ డైరెక్షన్లో పాన్ ఇండియన్ మూవీగా ...


బాహుబలి సినిమాతో శివగామిగా.. త్రూ అవుట్ ఇండియాలో అందర్నీ గడగడలాండించిన రమ్యకృష్ణ… తాజాగా లైగర్ సినిమాతో మన ముందకు రాబోతున్నారు. పూరీ డైరెక్షన్లో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈసినిమాలో మోడ్రన్ అండ్ మాస్ శివగామిగా తన నటనతో శివాలెత్తనున్నారు. ఆగస్టు 25న థియేటర్లలలో రీసౌండ్‌ చేయనున్నారు. ఇక ఈ క్రమంలోనే.. లైగర్‌ను ప్రమోట్ చేసేందుకు, మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు కదిలారు రమ్యకృష్ణ.హీరో విజయ్ దేవరకొండ, అనన్య తో కలిసి ముంబయ్ లైగర్ ప్రమోషన్‌లో తాజాగా పాల్గొన్నారు రమ్యకృష్ణ. ముంబయ్‌, జూహులోని సన్ అండ్ సాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీకి కూడా ఆమె అటెండ్ అయ్యారు. అయితే ఆప్టర్ పార్టీ.. హోటల్ నుంచి బయటికి వచ్చిన రమ్యకృష్ణను అరేబియా సముద్రం మీద నుంచి వీస్తున్న గాలులు కాస్త ఇరిటేట్ చేశాయి రమ్యకృష్ణ కట్టుకున్న చీరను, తల వెంట్రుకలను గాలులు చిందరవందర చేశాయి. దీంతో కాస్త ఇబ్బంది పడుతూనే… తన చీరను, తలవెంట్రుకలను సర్దుకుంటూ…అక్కడే ఉన్న ఫోటో గ్రాఫర్లకు ఫోజిచ్చారు. ఇక ఈమెతో పాటు.. విజయ్‌ దేవరకొండ, అనన్య కూడా… జోరుగా వీస్తున్న గాలిలో ఇబ్బంది పడుతూనే ఫోటోలకు ఫోజిచ్చారు. అక్కడి నుంచి జారుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow Us