కొడుకు లేడు.. కూతుళ్లు లేరు ఆ లగ్జరీ బంగ్లా నాకెందుకు ?? స్టార్ కపుల్.. షాకింగ్ నిర్ణయం!
తమిళ స్టార్ దంపతులు రాధికా శరత్‌కుమార్ తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు. చెన్నైలోని ECRలో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అందుకు గల కారణాన్ని శరత్‌కుమార్ వివరించారు.. తాము ఉన్న ఇల్లు 15 వేల అడుగుల విస్తీర్ణంలో ఉందనీ ఇంటికి ఏడు ద్వారాలున్నాయనీ అన్నారు.
ప్రతీ రోజు రాత్రి ఆ తలుపులకు గడియపెట్టడం ఇబ్బందవుతోందనీ తెలిపారు. రాధిక, శరత్ కుమార్ ల కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. ఇక వారి ఇంట్లో 15 మంది పనివాళ్లున్నా సరే.. రాధిక ఒక్కరే ఆ పెద్ద ఇంటిని చూసుకోవడం కష్టమవుతోందట. అందుకే ఇల్లు మారాం అన్నారు శరత్ కుమార్. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ ఐటీ కంపెనీకి అద్దెకిచ్చాం అని చెప్పుకొచ్చారు. శరత్‌కుమార్ చివరగా 3BHK సినిమాలో కనిపించారు. గణేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం 3BHK మూవీని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక రాధిక 1985లో నటుడు ప్రతాప్ పోతన్‌ను పెళ్లాడారు. ఏడాదికే అతడికి విడాకులిచ్చేసి బ్రిటీష్ వ్యక్తి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకున్నారు. వీరికి రయానే జన్మించింది. రెండేళ్లకే ఈ దంపతులు కూడా విడిపోయారు. 2001లో నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇటు శరత్‌కుమార్‌కు ఇది రెండో పెళ్లి! ఆయన మొదటగా చాయాదేవిని పెళ్లి చేసుకోగా వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2000వ సంవత్సరంలో చాయాతో విడాకులు తీసుకున్న శరత్‌కుమార్ మరుసటి ఏడాది రాధికను పెళ్లి చేసుకున్నారు. రాధిక- శరత్ కుమార్ జంటకు రాహుల్ అనే కొడుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు
TOP 9 ET News: అల్లు కుటుంబానికి GHMC షాక్ కూల్చేస్తామంటూ నోటీస్
భరణికి మెగా సపోర్ట్ !! వర్కవుట్ అవుతుందా ?? లేక..
పైన పటారం.. లోన లొటారం..! బిగ్ బాస్ గుట్టు రట్టు చేసిన తేజస్వి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

