తాడేపల్లిలో వింత జంతువు ప్రత్యక్షం.. దాన్ని చూసి భయపడిన స్థానికులు

Updated on: Mar 07, 2025 | 8:21 PM

గుంటూరు జిల్లా తాడేపల్లిలో నల్లగా ఒంటిపై మచ్చలతో ఉన్న నాలుగు కాళ్ల జంతువు చెంగు చెంగు మంటూ ఎగురుతూ కనిపించింది. అది ఒక్కసారిగా ఇంట్లోకి దూరడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మొదట ఆ జంతువు ఏంటో అన్న కంగారులో దూరంగా పారిపోయారు. అదే సమయంలో జనసమ్మర్ధం పెరిగిపోవడంతో ఆ జంతువు కూడా వారిని చూసి ఇళ్లలోకి వెళ్లి దాక్కోవడం మొదలు పెట్టింది.

అయితే అర గంట గడిచిన తర్వాత స్థానిక యువకులు పారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఒక ఇంట్లో మెట్ల కిందకి దూరిన వింత జంతువు పారిపోకుండా యువకులు అట్ట పెట్టెలు, బుట్టలు అడ్డుపెట్టారు. కొద్ది సేపటి తర్వాత పారెస్ట్ అధికారులు వచ్చి పునుగు పిల్లిగా గుర్తించి దాన్ని పట్టుకుని మంగళగిరి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పునుగు పిల్లి అంతరించి పోతున్న జీవుల్లో ఉందని ఇప్పుడు తాడేపల్లి కొండ ప్రాంతంలో కనపించడం ఆశ్చర్యంగా ఉందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఒక్క పునుగు పిల్లే ఉండటం సాధ్యం కాదని మరికొన్ని ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్! మరి రిషబ్ శెట్టి జై హనుమాన్ సంగతేంటంటే?

100 రోజుల్లో ప్రెగ్నెంటే టార్గెట్ ! నవ్విస్తూనే.. ఆలోచింపచేస్తున్న టీజర్

హీరోగా 10 సినిమాల్లో ఫెయిల్.. కట్ చేస్తే 1200కోట్లకు సంపాదన!

స్నేహితుడితో గడిపిన పాపానికి గర్భం దాల్చా.. ఆ తర్వాత