Prabhas Fans – Om Raut: పాపం ఓం రౌత్‌.. కనబడితే కొట్టేలా ఉన్నారు..! ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం.

|

Jun 18, 2023 | 11:37 AM

నిన్న మొన్నటి వరకు.. ఒకటే చర్చ.. ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమా ఫస్ట్ డే చూడాలనే రచ్చ. అనుకున్నట్టే.. ఎగబడి మరీ.. థియేటర్లకు వచ్చారు. వాటిని దేవాలయాలుగా మార్చేశారు. శ్రీరామ చరితాన్ని.. కొత్తగా సరొకొత్తగా చూడబోతున్నామని ఆనందించారు.

నిన్న మొన్నటి వరకు.. ఒకటే చర్చ.. ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమా ఫస్ట్ డే చూడాలనే రచ్చ. అనుకున్నట్టే.. ఎగబడి మరీ.. థియేటర్లకు వచ్చారు. వాటిని దేవాలయాలుగా మార్చేశారు. శ్రీరామ చరితాన్ని.. కొత్తగా సరొకొత్తగా చూడబోతున్నామని ఆనందించారు. ప్రభాస్‌ ను రాముడిగా చూడడం కన్నులకు పండగే అనుకున్నారు. సినిమాపై ఎక్కడలేని అంచనాలు పెంచుకున్నారు. కానీ కట్ చేస్తే… ఆదిపురుష్‌ సినిమా వారి అంచనాలకు అల్లంత దూరంలో ఉండడంతో…డైరెక్టర్‌ ఓం రౌత్‌ను విమర్శిస్తున్నారు. అందులోనూ.. రామాయణాన్ని వక్రీకరించినట్లు సినిమా చూసిన వారికి అనిపించడంతో.. డైరెక్టర్ ఓం తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఇక్కడ అక్కడ అని.. వాళ్లు వీళ్లు అని కాదు… ఆదిపురుష్‌ సినిమా చూసిన ప్రతీ వాళ్లు.. ఏదో విషయంగా డైరెక్టర్‌ ఓంను విర్శిస్తూనే ఉన్నారు. ఆయన పై విరుచుకుపడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో… విపరీతంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తీవ్ర వ్యాఖ్యలతో.. కనబడితే కొట్టేట్టు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.ఎస్ ! తమ హీరోను బాగా చూపించలేదని… డార్లింగ్ ఫ్యాన్స్..! రాముడి కంటే రావణాసురిడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మిడిల్ ఏజ్ మ్యాన్స్..! గ్రాఫిక్స్ నాసిరకంగా ఉందని గ్రాఫిక్స్ లవర్స్‌! అసలు ఇది రామాయణమేనా అని.. ఓల్డ్ జనరేషన్ పీపుల్స్‌! సీతను మరీ తక్కువ చేశారని లేడీస్‌..! ఇలా మొత్తంగా.. అన్ని రకాల ఏజుల వారి నుంచి..అందులోనూ.. డార్లింగ్ ఫ్యాన్స్‌ నుంచి.. తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ స్టార్ డైరెక్టర్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 18, 2023 09:58 AM