నాకు టెన్షన్‌గా ఉంది.. సలార్ రిలీజ్‌ వేళ.. డైరెక్టర్‌ షాకింగ్ కామెంట్స్

Updated on: Dec 22, 2023 | 9:58 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎంత ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇప్పటికే థియేటర్ల వద్ద సలార్ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా దర్శకధీరుడు రాజమౌళి సలార్ చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇక ఆ ఇంటర్వ్యూలో సలార్‌ రిజెల్ట్‌ పై తనకు టెన్షన్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ నీల్.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎంత ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇప్పటికే థియేటర్ల వద్ద సలార్ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా దర్శకధీరుడు రాజమౌళి సలార్ చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇక ఆ ఇంటర్వ్యూలో సలార్‌ రిజెల్ట్‌ పై తనకు టెన్షన్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ నీల్. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. సలార్ క్రేజ్ చూస్తే ఏమనిపిస్తుందని అడిగారు రాజమౌళి. తనకు టెన్షన్ గా ఉందని అన్నారు నీల్. ఇప్పటివరకు 4 సినిమాలు చేశానని.. కానీ ఏ సినిమాకు విడుదలకు ఇంతగా టెన్షన్ పడలేదని అన్నారు నీల్. అందుకు కారణం సలార్ చిత్రంలో డ్రామా ఎక్కువగా ఉందని.. ఇప్పటివరకు ఇంత డ్రామా ఎప్పుడూ ట్రై చేయలేదని.. అందుకే సలార్ క్రేజ్ చూస్తుంటే తనకు టెన్షన్ అవుతుందని చెప్పుకొచ్చాడు నీల్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tamannaah Bhatia: 132 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న తమన్నా ఆస్తుల విలువ

Bhole Shavali: రైతుబిడ్డ చేయి వదలని భోళె.. మంచితనంలో గొప్పోడబ్బా..

Dunki Review: ఈ ఏడాది షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టారా ?? డంకీ రివ్యూ

సలార్ Vs డంకీ.. మధ్య సర్వే.. దిమ్మతిరగే రిజల్ట్

Pallavi Prashanth: Tv9తో మాట్లాడిన పల్లవి ప్రశాంత్.. అసలేం చెప్పాడంటే ??