ఉస్తాద్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. సమ్మర్‌లోనే సందడి !!

Edited By: Phani CH

Updated on: Nov 22, 2025 | 1:39 PM

పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం 2026 ఏప్రిల్‌లో విడుదల కానుంది. హరీష్ శంకర్ పాట అప్డేట్, నిర్మాత రవిశంకర్ రిలీజ్ డేట్ ప్రకటన ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచింది. ఓజీ తర్వాత, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయ్యాక పవర్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్‌లపై ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్ ప్లాన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది.

ఏ సినిమాకు సంబంధించిన న్యూస్‌ అంతా ఆ సినిమా వేదిక మీద మాత్రమే రివీల్‌ అయ్యే రోజులు లేవిప్పుడు. యాక్టర్స్, టెక్నీషియన్స్.. ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా అప్డేట్‌లు ఇచ్చేయొచ్చు. మొన్నటికి మొన్న హరీష్‌ ఇచ్చిన అప్‌డేట్‌తోనే ఖుషీగా ఉన్న పవర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఇప్పుడు ప్రొడ్యూసర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఏంటది? ఓజీ సినిమా 50 రోజులు కంప్లీట్‌ అవగానే ఆ సినిమా గురించి మాట్లాడటం ఆపేశారు పవర్‌స్టార్‌ ఫ్యాన్స్. ఇప్పుడు ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల గురించి తెలిసిన డైరక్టర్‌ ఈ మధ్యనే అప్డేట్‌ ఇచ్చేశారు. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సాంగ్‌ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తామనే మాట నాన్‌స్టాప్‌గా వైరల్‌ అయింది. హరీష్‌ శంకర్‌ అప్‌డేట్ తో ఖుషీ అయిన ఫ్యాన్స్ కి కిర్రాక్‌ లీక్‌ ఇచ్చేశారు నిర్మాత రవిశంకర్‌. 2026 ఏప్రిల్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆ సినిమా సక్సెస్‌ మీద మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారన్నది మాటల్లోనే అర్థమవుతోంది. ఆల్రెడీ ఓజీ మేనియాకి ఫుల్‌స్టాప్‌ పడింది. సమ్మర్‌తో చేతిలో ఉన్న ఉస్తాద్‌ కూడా కంప్లీట్‌ అవుతుంది. ఆ తర్వాత పవర్‌స్టార్‌ ఏం చేస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. అంతలోపే కొత్త సినిమాను అనౌన్స్ చేస్తారా? ఆల్రెడీ ఉన్న కమిట్‌మెంట్స్ ని రెజ్యూమ్‌ చేస్తారా? పవర్‌స్టార్‌ మనసులో ఏం ఉందనే క్యూరియాసిటీ కూడా జనాల్లో బాగా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆంధ్రాకింగ్‌ రామ్‌కి సక్సెస్‌ తెచ్చిపెడుతుందా ??

రఫ్ఫాడిస్తున్న హీరోయిన్స్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదంటున్న ముద్దుగుమ్మలు

ట్రెండ్‌ అవుతున్న ఆలియా.. ఆమె వెంటనే సంయుక్త జాజికాయ

కాంట్రవర్సీలను జక్కన్న కావాలనే క్రియేట్‌ చేస్తారా ??

కాలువలో దిగి.. ఎక్కలేకపోయిన ఏనుగు.. ఆ తర్వాత