Pallavi Prashanth: ఇంత బతుకు బతికి చివరకు.. పాపం! బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ

Updated on: Aug 01, 2025 | 3:36 PM

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారైనా వెళ్లిరావాలన్నది చాలా మంది కల. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కూడా. అలాంటి కలను నెరవేర్చుకోవడమే కాకుండా ఏకంగా విన్నర్‌గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ఒక కామన్ మ్యాన్ గా హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఏకంగా బిగ్‌బాస్ విజేతగా బయటికి తిరిగొచ్చాడు. రైతు బిడ్డ ట్యాగ్ తో బుల్లితెర అభిమాను గెల్చుకుని బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ విజేతగా అవతరించాడు.

అయితే బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైంది పల్లవి ప్రశాంత్ కు. గ్రాండ్‌ ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆర్టీసీ బస్సు కూడా ధ్వంసమైంది. దీంతో పోలీసులు బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో భాగంగా కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపాడు ప్రశాంత్. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇప్పుడిదే సంఘటనను మళ్లీ గుర్తు చేసుకున్నాడు రైతు బిడ్డ. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ రైతు బిడ్డ.. ఉన్నట్టుండి ఎమోషనల్ అయ్యాడు. ఇంత బతుకు బతికి.. మా నాన్నను కోర్టు మెట్లు ఎక్కేలా చేశానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటన తలచుకుంటే నాకు ఇప్పటికీ బాధగానే ఉందని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ గొడవ ఎవరు చేశారో తనకు తెలియదని.. కానీ ఎవరైనా సరే కర్మ వారిని వదిలిపెట్టదన్నాడు పల్లవి ప్రశాంత్. తాను జైలుకు వెళ్లి నాలుగు రోజులు ఉన్నానని.. అక్కడ బిగ్ బాస్ లో ఎవరు విజేత అంటూ తననే అడగడం తట్టుకోలేకపోయా అన్నాడు.తాను జైలుకు వెళ్లడంతో మానాన్న బెయిల్ కోసం కోర్టు మెట్ల దగ్గర పడుకోవడం తాను ఎప్పటికీ మర్చిపోలేనంటూ అంటూ ఎమోషనల్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొబైల్ లో మునిగి పోయిన ముసలివాడు.. ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండగా.. ఏం చేసాడంటే

అరుదైన భారీ పుట్టగొడుగు.. చూసి ఆశ్చర్యపోతున్న జనం

కదులుతున్న కారుపై కవ్విస్తూ డాన్స్ చేస్తున్న మహిళా.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్

ప్రియురాలిని వశం చేసుకోవాలని చేయకూడని పని చేసాడు.. చివరికి

‘మనం కొట్టినమ్‌ అంటూ..’ VDకి రష్మిక ఎమోషనల్ ట్వీట్‌