Upasana Konidela: మామయ్యా.. అంటూ.! చిరు అవార్డుపై ఉపాసన క్రేజీ ట్వీట్..

Updated on: Jan 27, 2024 | 11:41 AM

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్‌ అవార్డ్‌ వచ్చిందని.. తెలుగు ప్రజలే ఎగిరిగంతేస్తున్నారు. అలాంటిది వాళ్లింటి సభ్యులు రియాక్టవ్వరా చెప్పండి. అవుతారు కదా..! ఎస్ ! ఎట్ ప్రజెంట్ మెగా కోడలు ఉపాసన కూడా ఇదే చేశారు. ఒక్క చిన్న ట్వీట్తో... నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఓ పక్క మెగా ఫ్యామిలీ ఇంటి పనులతో.. మరో పక్క బేబీ ఆలనా పాలనాలో.. ఇంకో పక్క తన హోమ్‌ బిజినెస్‌లో బిజీగా ఉండే ఉపాసన..

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్‌ అవార్డ్‌ వచ్చిందని.. తెలుగు ప్రజలే ఎగిరిగంతేస్తున్నారు. అలాంటిది వాళ్లింటి సభ్యులు రియాక్టవ్వరా చెప్పండి. అవుతారు కదా..! ఎస్ ! ఎట్ ప్రజెంట్ మెగా కోడలు ఉపాసన కూడా ఇదే చేశారు. ఒక్క చిన్న ట్వీట్తో… నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఓ పక్క మెగా ఫ్యామిలీ ఇంటి పనులతో.. మరో పక్క బేబీ ఆలనా పాలనాలో.. ఇంకో పక్క తన హోమ్‌ బిజినెస్‌లో బిజీగా ఉండే ఉపాసన.. తాజాగా తన మామయ్యకు విషెస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రిలీజ్‌ చేసిన.. పద్మవిభూషన్ విన్నర్స్‌ లిస్టును కూడా.. తన లిస్టులో పోస్ట్‌ చేసి.. చిరు పేరును మార్క్‌ చేశారు. కంగ్రాట్స్‌ డియరెస్ట్ మామయ్య అంటూ.. తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌ సర్కిల్లోనూ వైరల్ అవుతోంది. మామయ్య అవార్డ్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటున్న కోడలనే ట్యాగ్ కూడా నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos