Nithya Menen: ప్రభాస్‌ కారణంగా మానసికంగా కుంగిపోయా..

Updated on: Jul 04, 2025 | 3:14 PM

ప్రభాస్..!... ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న స్టార్. అలాంటి స్టార్ హీరో సినిమాల్లో జెస్ట్ అలా కనిపించినా చాలని చాలామంది హీరోయిన్లు అనుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ నిత్య మాత్రం ప్రభాస్‌ వల్ల మానసికంగా కుంగిపోయానంటోంది. అంతే కాదు.. ‘నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది’అని తనలో తానే మథనపడిపోతోంది.

ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం ఏంటో కూడా నిత్య చెప్పుకొచ్చింది. ‘అలా మొదలైంది’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన నిత్య… అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ట్యాలెంటెడ్ నటిగా గుర్తింపుతెచ్చుకుంది. ఇప్పుడు తమిళం, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో.. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లల్లో ప్రభాస్ గురించి ఓ కామెంట్ చేసింది. ఆ కారణంగా తాను మానసికంగా చాలా రోజులు బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చింది. “నేను ఇండస్ట్రీలోకి రాకముందు తెలుగు సినిమాలు అంతగా చూడలేదు. దీంతో టాలీవుడ్ నటీనటుల మీద కూడా నాకు గొప్ప నాలెడ్జ్ లేదు. కానీ, ఆ టైమ్‌లో నన్ను ఒక ఇంటర్వ్యూలో ఒకరు ప్రభాస్ గురించి అడిగితే.. తెలియదని చెప్పాను. దీంతో.. అందరూ నాపై విమర్శలు చేశారు. దీంతో అప్పటి నుంచి నిజాయితీగా జవాబులు చెప్పకూడదని డిసైడ్ అయ్యాను. కానీ, ఆనాటి నా ఆన్సర్ మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా నాకు బాధగానే ఉంటుంది’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిత్య మీనన్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోగులను గాలికి వదిలేసి.. ఈ డాక్టర్‌ చేసిన పనికి.. అస్సలు..

‘ఇంకా మూడు రోజులే’.. వంగా వాణి నిజమైతే ?? బాబోయ్

వేసవిలో వెంకన్న హుండీకి రికార్డు ఆదాయం

పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్

టూ వీలర్‌ కొంటున్నారా.. ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే