Macherla Niyojakavargam: 'నేను అలా చేయలేదంటున్నా వినరే'.! నితిన్‌ డైరెక్టర్ శేఖర్ ఆవేదన...(వీడియో)

Macherla Niyojakavargam: ‘నేను అలా చేయలేదంటున్నా వినరే’.! నితిన్‌ డైరెక్టర్ శేఖర్ ఆవేదన…(వీడియో)

Anil kumar poka

|

Updated on: Aug 09, 2022 | 6:46 PM

ఎవరికి, ఎప్పుడు, ఎలా మనోభావాలు దెబ్బంటాయో.. ఈ రోజుల్లో ఎవరూ చెప్పలేం. ఎప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో ఓ ఇష్యూ చెలరేగుతుందో.. అసలికే చెప్పలేం. కాని అలా ఉన్నట్టుండే.. నితిన్‌ సినిమాపై ఓ పిడుగు లాంటి వివాదం చెలరేగింది.


ఎవరికి, ఎప్పుడు, ఎలా మనోభావాలు దెబ్బంటాయో.. ఈ రోజుల్లో ఎవరూ చెప్పలేం. ఎప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో ఓ ఇష్యూ చెలరేగుతుందో.. అసలికే చెప్పలేం. కాని అలా ఉన్నట్టుండే.. నితిన్‌ సినిమాపై ఓ పిడుగు లాంటి వివాదం చెలరేగింది. లవర్‌ బాయ్‌ టూ.. యాక్షన్ బాయ్‌ గా మారేందుకు వస్తున్న తన సినిమాపై బ్యాన్‌ అనే బండ పడేలా చేసింది. దీంతో తల పట్టుకుని లబోదిబో అనడం.. ఈ యంగ్ హీరో వంతవుతోంది. అయితే అసలు వివాదం ఏంటి? ఎందుకీ రగడ! అనే ఆతురత మాత్రం ఇప్పుడందరిలో మదిని వెంటాడుతోంది. హీరో పేరు నితిన్‌ రెడ్డి, సినిమాలో క్యారెక్టర్ పేరు సిద్ధార్థ రెడ్డి, సినిమాలోని పాట పేరు రెడ్డి, ఈసినిమా డైరెక్టర్ పేరు రాజశేఖర్ రెడ్డి. ఈ పేర్లకున్న తోకలే ఇప్పుడు నితిన్ సినిమాను ఇబ్బంది పెడుతున్నాయి. డైరెక్టర్ పేరుతో సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ ట్వీట్‌కు సాక్ష్యాలుగా మారుతున్నాయి.సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలనే కోరికను మాచర్ల నియోజకవర్గం సినిమాతో నెరవేర్చుకుంటున్న తనపై ఎవరో కావాలనే సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారనేది డైరెక్టర్ శేఖర్ వాదన. అందుకే తన పేరులోని ఒక అక్షరాన్ని తీసేసి.. అదే పేరుతో.. ప్రొఫైల్ పిక్చర్‌ తో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేశారని.. ఆ అకౌంట్‌లో వేరు కులాల్ని తిట్టినట్టుగా ట్వీట్లు చేశారని ఆయన ప్రధాన ఆరోపణ. అయితే ఆరోపణ చేయడమే కాదు.. ఈ ఫేక్ అకౌంట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసి.. అందరికీ వివరణ ఇచ్చారు ఈ డైరెక్టర్ . అయినా ఈ వివాదం సద్దుమనగడంతో డైరెక్టర్ తో పాటు హీరో నితిన్ కూడా తాజాగా రంగంలోకి దిగారు. ఫేక్ పర్సన్ చేసి ఫేక్ ట్వీట్‌ తోనే ఇంత రచ్చ జరుగుతుందని తను కూడా ట్వీట్ చేశారు. ఖండించారు. ఇదో విషప్రచారం నమ్మకండని అన్నారు. దాంతో పాటు.. ఈ ట్వీట్లపై సైబర్ సెల్లో కూడా కంప్లైట్‌ ఫైల్ చేశారు. తన సినిమా రిలీజ్కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 09, 2022 06:46 PM