Negative Reviews Effecting: రవితేజ కొంత ముంచిన రివ్యూగాళ్లు.. దెబ్బకు తలపట్టుకున్నాడు పో..!
నెగెటివ్ రివ్యూలు తెలుగు సినిమాల నడ్డి విరగొడుతున్నాయా..? విచ్చలవిడి తనంతో రివ్యూలు ఇచ్చే కొంతమంది వల్ల.. సినిమాలు నష్టాల పాలవుతున్నాయా? పబ్లిసిటీల కోసం పాకులాడే యువత..
నెగెటివ్ రివ్యూలు తెలుగు సినిమాల నడ్డి విరగొడుతున్నాయా..? విచ్చలవిడి తనంతో రివ్యూలు ఇచ్చే కొంతమంది వల్ల.. సినిమాలు నష్టాల పాలవుతున్నాయా? పబ్లిసిటీల కోసం పాకులాడే యువత.. రివ్యూల పేరుతో.. యూట్యూబ్‌లో విపరీతమైన రచ్చ చేస్తున్నారా? చివరికి వారు చూస్తున్న సినిమాకే.. చీడపీడల్లా తయారవుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ అనలిస్ట్స్ అండ్ క్రిటిక్స్.ఇప్పటికే కరోనాతో కుదేలవుతున్న సినీ పరిశ్రమపై.. రివ్యూల పిడుగు పడింది. ఫస్ట్ డే ఫస్ట్ షో.. థియేటర్ల ముందు రివ్యూల పేరుతో కొందరు వ్యక్తులు చేస్తున్న రచ్చ మరీ ఎక్కువవుతోంది. సినిమా చూడ్డానికి వచ్చే జనాల కంటే.. వీరి వల్లే థియేటర్ ప్రాంగణం నిండిపోతోంది. దానికి తోడు.. విచ్చలవిడితనంతో.. సినిమాపై హీరోపై చేస్తున్న నెగెటివ్ కామెంట్స్ వీరికి నేము ఫేము తీసుకువస్తున్నాయి. ఇలాంటి పనిని ఓ వృత్తిగా మలుచుకునేందుకు వారిని పురిగొల్పుతున్నాయి. అయితే తాజాగా ఇలాంటి రివ్యూల వల్లే.. రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇబ్బందుల్లో పడింది.శరత్ మండవ డైరెక్షన్లో.. తెరకెక్కిన ఈ సినిమా.. రిలీజ్ ముందు చాలా బజ్ చేసింది. రవితేజకు మరో హిట్టు పడ్డట్టే అనే హింట్ అందరికిచ్చింది. కాని రిలీజైన తరువాత నెగెటివ్ రివ్యూల పుణ్యమాని బాక్సీఫీస్ ముందు తలపట్టుకుని కూర్చుంది. సినిమా స్టోరీ దగ్గర నుంచి, ట్విస్టుల వరకు.. క్యారెక్టర్స్ బిహేవియర్ దగ్గర నుంచి.. వారి చెప్పే డైలాగుల వరకు అన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షోనే రివ్యూగాళ్లు చెప్పేయడం.. సినిమాకు మైనస్ అయింది. అసలే టికెట్ రేట్లు ఎక్కువనే ఫీలింగ్ లో జనాలు.. దానికి తోడు బయటికి వస్తే కరోనా ఎక్కడ అంటుతుందోనని భయాలు.. సరిగ్గా ఇలాంటి సిట్య్చూవేషన్ లోనే సినిమాపై తేడా తేడా రివ్యూలు. దీంతో తీవ్రంగా ఎఫెక్ట్ అవుతోంది తెలుగు సినిమా.. అందుకు ఉదహరణగా మిగిలింది రవితేజ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ సినిమా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..