నవీన్ పొలిశెట్టి కామెడీతో మ్యాజిక్ చేశాడా.. మూవీ హిట్టా..? ఫట్టా..?
ఆఫ్టర్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' హిట్ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న నవీన్ పొలిశెట్టి.. ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చాడు. అనగనగా ఒక రాజు సినిమాతో మరో సారి సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నించాడు. మరి ఈ హీరో ప్రయత్నం నెగ్గిందా? ఈ రాజు ప్రేక్షకుల మనసు దోచాడా? లేదా? అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.
ఇన్ సార్ట్‌లో అనగనగా ఒక రాజు కథ గురించి చెప్పాలంటే.. ఊర్లో జమిందారీ వంశంలో పుట్టిన రాజు అలియాస్ నవీన్ పొలిశెట్టి పూర్తి అప్పుల్లో ఉంటాడు. తాత చేసిన పనుల కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నా.. ఉన్నట్టు కటింగ్ ఇస్తూ కాలం గడిపేస్తుంటాడు. అలాంటి రాజు కొన్ని పరిస్థితుల వల్ల.. డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని.. ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలోనే పక్కూరు భూపతి రాజుగారి కూతురు చారులత అలియాస్ మీనాక్షి చౌదరి రాజు లైఫ్‌లోకి వస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడతాడు రాజు. ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాజును చిక్కుల్లో పడేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది. రాజు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది. అనేది రిమైనింగ్ కథ.కథ పాతదే.. కానీ వండే విధానంలో ఎంటర్‌టైన్మెంట్‌ను యాడ్ చేసి.. డిలీషియస్‌గా వడ్డించే ప్రయత్నాన్ని ఈమధ్య ఎక్కువగా చేస్తున్నారు మన టాలీవుడ్ మేకర్లు. అనగనగా రాజు విషయంలోనూ డైరెక్టర్ మారి కూడా అదే చేశాడు. ఊర్లో రాజు కాని రాజు..! ఆ రాజుకు కష్టాలు..! రిచ్ లైఫ్ కోసం ప్రయత్నాలు..! అందుకు పెళ్లే షార్ట్ కట్ అని అనుకోడాలు..ఆ తరువాత జరిగన పరిణామాలు..! ఇలా పాత టెంప్లీట్‌నే తీసుకున్నాడు డైరెక్టర్ మారి. అయితే దానికి నవీన్ పొలిశెట్టి అనే ఎంటర్‌టైనర్‌ను జోడించి.. పంచ్‌లతో.. ప్రాసలతో.. కొట్టొచ్చే తెలుగు నేటివిటీతో.. తన సినిమాను పర్‌ఫెక్ట్‌గా ప్యాక్ చేశాడు. అందులో సక్సెస్ కూడా అయ్యాడు.
