సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 75కే మల్టీప్లెక్సుల్లో మూవీ చూసే ఛాన్స్.!

Updated on: Sep 21, 2022 | 8:03 PM

ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూడాలంటే.. జేబులకు చిల్లు పడాల్సిందే. సుమారు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుంది.

ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూడాలంటే.. జేబులకు చిల్లు పడాల్సిందే. సుమారు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. అలాంటిది మీకు కేవలం 75 రూపాయలకే సినిమా చూసే ఛాన్స్ వస్తే.. మూవీ లవర్స్‌కు అంతకంటే హ్యాపీ ఇంకేముంటుంది చెప్పండి.! అందుకే వారికోసమే ఈ గుడ్ న్యూస్. సెప్టెంబర్ 23వ తేదీ జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మూవీ లవర్స్‌ కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 23.. ఒక్క రోజు అన్ని ప్రధాన నగరాలలోని మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో 75 రూపాయలకే అన్ని సినిమాలు చూడవచ్చు. పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ లాంటి ప్రధాన మల్టీప్లెక్స్‌లు ఈ డిస్కౌంట్ రేట్‌కే టికెట్లు విక్రయించనున్నాయి. డైరెక్ట్‌గా అయితే టికెట్ రేట్ 75 రూపాయలు ఉంటుంది గానీ.. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునేవారికి మాత్రం అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక థియేటర్లలో ప్రస్తుతం పలు మంచి చిత్రాలు స్క్రీనింగ్ అవుతున్నాయి. మరింకెందుకు ఆలస్యం..? మీకు నచ్చిన సినిమాను ఈ ‘నేషనల్ సినిమా డే’ రోజున తక్కువ ధరకే మల్టీప్లక్స్‌ థియేటర్లో కూర్చుని చూసేయండి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: పెళ్లి విందులో అప్పడం లొల్లి.. ఏకంగా లక్షన్నర నష్టం

RRR: కేంద్ర ప్రభుత్వ చేతుల్లో.. RRR ఆస్కార్ ఆశలు..

Mahesh Babu: స్టోరీ చెబితే మహేష్ ‘నో’ అన్నారు.. అలాంటి సినిమానే కావాలన్నారు..

Sonu Sood: న్యూడ్ వీడియోలపై హెచ్చరించిన సోనుసూద్..

మరీ ఇంత దారుణమా.. మేకప్ లేకపోతే సీత ఇలానా..

Published on: Sep 21, 2022 08:03 PM
Loading...
Unable to load recommendations.
Follow Us