సెట్స్ మీదున్న వెండితెర దేవుళ్లు.. పోటీ మామూలుగా లేదుగా
సిల్వర్ స్క్రీన్‌పై పౌరాణిక చిత్రాల సందడి పెరిగింది. మన దేశంలో అత్యంత భారీ సినిమాలు దైవ సబ్జెక్టులతో రూపుదిద్దుకుంటున్నాయి. అఖండ సీక్వెల్, మహేష్ బాబు రాముడిగా, రణబీర్ రాముడిగా వస్తున్న సినిమాలు, హనుమాన్ చిత్రాల సీక్వెల్స్, ఇంకా పలు పౌరాణిక, భక్తి రస ప్రధాన చిత్రాలతో పోటీ మామూలుగా లేదు.
సిల్వర్ స్క్రీన్ మీద పురాణపురుషులందరూ వరుసగా దర్శనమివ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ సినిమాలన్నీ దేవుళ్ల సబ్జెక్టులతో రూపొందుతున్నవే. రామాయణం, భారతం, భాగవతంలో ఉన్న సారమంతా అఖండ సీక్వెల్‌లో ఉందని అంటున్నారు కెప్టెన్ బోయపాటి శ్రీను. కొన్ని విషయాలు గంటకొట్టి చెప్పినప్పుడు జనాలకు మరింతగా కనెక్ట్ అవుతాయని ఈ మూవీ కూడా అలాంటిదేనన్నారు. రామతత్వంతో వస్తున్న సినిమాల సంఖ్య కూడా మెండుగా కనిపిస్తోంది. వారణాసి సినిమా కోసం మహేష్‌కి రాముడి గెటప్ వేసి చూసి మురిసిపోయారు రాజమౌళి. 2027లో మహేష్‌ని రాముడి అవతార్‌లో చూడ్డానికి రెడీగా ఉన్నారు. అంతకన్నా ముందే 2026లో రాముడిగా తెరపై కనిపించనున్నారు రణ్‌బీర్. ఇటు మిరాయ్ సినిమా సీక్వెల్ మిరాయ్ జైత్రయలోనూ రాముడు కనిపించనున్నారు. చందు మొండేటి తెరకెక్కిస్తున్న పక్కా యానిమేషన్ సినిమ వాయుపుత్రలోనూ హనుమంతుడే హీరో. ఇటు హనుమాన్‌కి సీక్వెల్‌గా రూపొందనున్న జై హనుమాన్ లోనూ రామతత్వం మెండుగా కనిపించనుంది. ప్రశాంత్ వర్మ నిర్మాణంలోనే మహాకాళి కూడా రెడీ అవుతోంది. ఇటు నయనతార కీలక పాత్రలో నటిస్తున్న మూకుత్తి అమ్మన్2 దాదాపుగా పూర్తి కావచ్చింది. కల్కి సినిమా సీక్వెల్‌లోనూ కర్ణుడు, కృష్ణుడు, వారణాసి ఎలిమెంట్స్ ప్రధానంగా కనిపించనున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే.. ఆ పని చేయాల్సిందేనా ??
రెండు పార్టులుగా రానున్న ప్రభాస్ ఫౌజీ ?? ఆనందంలో అభిమానులు
వైరల్ వయ్యారికి లేడీ సూపర్‌స్టార్ సలహాలు.. ఇంకా హిట్ పక్కనా ??
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

