Mohan Babu – Chiranjeevi: చిరు పద్మ విభూషణ్‌పై మోహన్ బాబు రియాక్షన్.!
మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేరింది. సినిమాలతో పాటు సామాజిక సేవా రంగాల్లో మెగాస్టార్ కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. దేశంలో రెండో అత్యున్నతమైన పురస్కారం చిరంజీవికి రావడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలోనూ మెగాస్టార్ పేరు మార్మోగిపోతోంది.
మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేరింది. సినిమాలతో పాటు సామాజిక సేవా రంగాల్లో మెగాస్టార్ కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. దేశంలో రెండో అత్యున్నతమైన పురస్కారం చిరంజీవికి రావడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలోనూ మెగాస్టార్ పేరు మార్మోగిపోతోంది. ఫ్యాన్స్, నెటిజన్లు చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిరంజీవి పద్మవిభూషన్ అవార్డు రావడంపై స్పందించారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా.. ఓ ట్వీట్ చేశారు.
ఇంతకీ మోహన్ బాబు రియాక్షన్ ఏంటంటే..! “నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి నువ్వు అన్ని విధాలా అర్హుడివి. పద్మ విభూషన్ అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నాను” అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మోహన్ బాబు. ఇక మంచు విష్ణు కూడా చిరంజీవికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపాడు. “నిద్ర లేవగానే శుభవార్త విన్నాను. చాలా సంతోషం అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం” అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos