Ravi Teja: జోష్ మీదున్న మాస్ మహా రాజా.. ఒకేసారి మూడు సినిమాలు.. వీడియో
విజయం ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో ప్రస్తుతం మాస్ మహా రాజా రవితేజాను చూస్తే అర్థమవుతోంది. 2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ వరుస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చారు.
విజయం ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో ప్రస్తుతం మాస్ మహా రాజా రవితేజాను చూస్తే అర్థమవుతోంది. 2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ వరుస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చారు. తర్వాత వచ్చిన ‘క్రాక్’తో ఒక్కసారిగా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు రవి. 2020లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఒక్కసారి స్వింగ్‌లోకి వచ్చిన రవితేజ ఆ జోష్‌లో వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 67వ చిత్రం ‘ఖిలాడి’ని పూర్తి చేసే పనిలో పడ్డ రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో 68వ చిత్రాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌కి వెళ్లకముందే.. రవితేజ మరో కొత్త సినిమాను పట్టాలెక్కించారు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 69వ చిత్రం చేయనున్నారు. ఈ విషయాన్ని రవి తాజాగా.. ట్విట్టర్ వేదికగా అధికారింగా ప్రకటించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఓరి వీడి సరదా పాడుగాను.. పాపం.. కొత్త జంటను ఎత్తిపడేశాడు.. ఫన్నీ వీడియో..