మాస్ ఫీస్ట్ సిద్ధం చేసిన మాస్‌ మహారాజ్‌

Edited By: Phani CH

Updated on: Oct 30, 2025 | 3:20 PM

మాస్ మహారాజ్‌ రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ మాస్ జాతర. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పీక్స్‌లో జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన మేకర్స్‌ ఆ ఈవెంట్‌కు 24 గంటల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఒక్కటి కూడా రాలేదు. క్రాక్‌ తరువాత రవితేజ నుంచి ఆ రేంజ్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. ఇప్పుడు మాస్‌ జాతరతో ఆ లోటు తీరబోతుందన్న హింట్ ఇచ్చింది మూవీ టీమ్‌. చాలా కాలం తరువాత వింటేజ్‌ రవితేజను గుర్తు చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసింది.ట్రైలర్‌ కట్‌తోనే ఆడియన్స్‌కు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మూవీ టీమ్‌. ముఖ్యంగా రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్‌, సెటైరికల్‌ డైలాగ్స్‌తో వావ్ అనిపించేలా ట్రైలర్‌ను కట్ చేసింది మూవీ టీమ్‌. ముఖ్యంగా వింటేజ్‌ రవితేజను గుర్తు చేసేలా ఉన్న సీన్స్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ సూపర్ ఫామ్‌లో ఉన్న భీమ్స్‌, మాస్ జాతార కోసం మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన నాలుగు పాటలు పక్కా కమర్షియల్‌ బీట్స్‌తో అదరగొట్టాయి. దీంతో సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తరువాత ఆ అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా

Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల

Krrish 4: క్రిష్‌ మూవీలో జాకీచాన్‌.. డీల్‌ ఓకేనా

‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా

నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే

Published on: Oct 30, 2025 03:03 PM