Mansoor Ali Khan – Trisha: ఏంట్రా ఇది? ఈయన ఇలా మారాడు.? త్రిష మద్దతుగా మన్సూర్.

|

Feb 23, 2024 | 8:29 AM

స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు చేసిన చీప్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ నాయకుడి కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఏవీ రాజుపై సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా త్రిషకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరో విశాల్, నిర్మాత అదితీ రవిచంద్రన్ ఏవీ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిషకు సపోర్టుగా నిలిచారు.

స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు చేసిన చీప్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ నాయకుడి కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఏవీ రాజుపై సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా త్రిషకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరో విశాల్, నిర్మాత అదితీ రవిచంద్రన్ ఏవీ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిషకు సపోర్టుగా నిలిచారు. గతంలో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మన్యూర్‌ కూడా.. త్రిషకే మద్దతుగా మాట్లాడి తాజాతా అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. కొన్ని నెలల క్రితం త్రిష పై అనుచిత కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్. ఈ విషయంలో చిరంజీవి, ఖుష్బూ లాంటి ప్రముఖులు సైతం మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు కూడా అతనికి మొట్టికాయలు వేసింది. దీంతో దిగొచ్చి త్రిషకు క్షమాపణ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి త్రిషకు మద్దతుగా నిలిచి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. అన్నాడీఎంకే నేత వ్యాఖ్యలను ఖండించారు.

త్రిషపై ఏవీ రాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మన్సూర్ అలీ ఖాన్ ఖండించాడు. తన తోటి నటీమణుల విషయంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చాలా బాధగా అనిపిస్తుందన్నాడు. ఇలాంటి నిరాధార ఆరోపణలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్నాడు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మన్సూర్ డిమాండ్‌ చేశాడు. ప్రస్తుతం మన్సూర్ కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా మన్సూర్ తన తప్పును తెలుసుకున్నాడంటూ చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Feb 23, 2024 08:09 AM