Manchu Vishnu: ట్రోలర్స్‌.. ' మా' తో బీ కేర్‌ ఫుల్‌.! పిచ్చి కూతలు కూస్తే.. ఎత్తిపడేస్తాం..

Manchu Vishnu: ట్రోలర్స్‌.. ‘ మా’ తో బీ కేర్‌ ఫుల్‌.! పిచ్చి కూతలు కూస్తే.. ఎత్తిపడేస్తాం..

Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Jul 14, 2024 | 7:51 AM

ట్రోలింగ్‌.. ట్రోలింగ్‌..ట్రోలింగ్‌... ఐ డోంట్‌ లైక్‌ ట్రోలింగ్‌. ఐ అవైడ్‌ ఇట్... అంటున్నారు మూవీ అర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మంచు విష్ణు. ట్రోలర్స్‌ తో మాకు దోస్తీ అవసరం లేదు... మాతో దుష్మనీ వాళ్లు తట్టుకోలేరంటూ... లిమిట్స్‌ దాటిన ట్రోలర్స్‌ తాటతీస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక వెర్రి వెయ్యి తలలు వేస్తుంది.

ట్రోలింగ్‌.. ట్రోలింగ్‌..ట్రోలింగ్‌… ఐ డోంట్‌ లైక్‌ ట్రోలింగ్‌. ఐ అవైడ్‌ ఇట్… అంటున్నారు మూవీ అర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మంచు విష్ణు. ట్రోలర్స్‌ తో మాకు దోస్తీ అవసరం లేదు… మాతో దుష్మనీ వాళ్లు తట్టుకోలేరంటూ… లిమిట్స్‌ దాటిన ట్రోలర్స్‌ తాటతీస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక వెర్రి వెయ్యి తలలు వేస్తుంది. ఏదైనా చేయోచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు అంటూ యూట్యూబ్, ఇన్‌స్టా, ఎక్స్‌ వేదికగా కొంత మంది రెచ్చిపోతున్నారు. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. మనలెవడ్రా ఆపేది అంటూ ఇష్టమొచ్చినట్లుగా బిహేవ్‌ చేస్తున్నారు. అలాంటి ట్రోలర్స్‌ని టార్గెట్‌ చేసింది మూవీ అర్టిర్ట్స్‌ అసోసియేషన్. సినిమా వాళ్ల మీద డార్క్‌ కామెడీ చేస్తున్న ట్రోలర్స్‌ తాట తీస్తోంది. నటీనటులపై అసభ్యంగా దుష్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్‌ చానెల్స్‌ను డిలీట్‌ చేయించింది మూవీ అసోసియేషన్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.