నేను చేసిన ఎదవ పనికి.. పాపం.. NTR గుక్కపెట్టి ఏడ్చాడు!
చాలా కాలం తర్వాత మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లం కొండా సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. తమిళ్ సినిమా గరుడన్ సినిమాకు రీమేక్ గా భైరవం సినిమా విడుదలైంది.
యాక్షన్ ఎంటైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. భైరవం సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ మనోజ్ హుషారుగా పాల్గొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. భైరవం సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న మనోజ్.. జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి మరో అందరితో షేర్ చేసుకున్నాడు. గతంలోనూ మనోజ్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్, మనోజ్ మంది ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పెరిగారు. అలాగే ఇద్దరి పుట్టిన రోజులు కూడా ఒక్కటే.చిన్న తనంలో ఎంతో అల్లరి కూడా చేసేవారట వీరిద్దరూ.! ఈ క్రమంలోనే చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తుచేసుకున్నాడు మనోజ్. తాను చేసిన వెధవపని వల్ల ఎన్టీఆర్ బాగా ఏడ్చాడని చెప్పాడు. చిన్న తనంలో మేము ఐదో, ఆరో తరగతి చదువుతున్నాం.. ఓ పెళ్ళికి వెళ్ళాం. అక్కడ మేము ఓ ప్రయోగం చేశాం. ఒక బెలూన్ ను తీసుకొచ్చి.. దానికి మంట పెట్టాను.. అది కాస్తా ఎన్టీఆర్ చేతికి అంటుకుంది. దాంతో ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడు. ఎన్టీఆర్ ఏడుపు చూసి మా అమ్మమ్మ వచ్చి తనను చితక్కొట్టిందంటూ నవ్వుతూ చెప్పాడు మనోజ్. మా అమ్మమ్మ ఆదిలక్షమ్మ.. బిడ్డను చంపేస్తావా అంటూ తనను తరిమి తరిమి కొట్టారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో మంచు లక్ష్మీ హోస్ట్ గా చేసిన ఓ షోలో ఎన్టీఆర్ కూడా మనోజ్ తో చేసిన అల్లరి గురించి చెప్పాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకప్పుడు వైజాగ్‌లో అరటి పండ్లు అమ్మాడు.. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం
సమస్యే లేదు.. ఆమె లేనిది సినిమానే లేదు
‘ప్రేమే పొట్టన పెట్టుకుంది’ పాపం! హీరోయిన్ వెలుగొందాల్సింది.. శవమై కనిపించింది
నోటి దురుసు.. స్టార్ సింగర్ అయితే సరిపోదు.. సభ్యత ఉండాలి?
ప్రేమగా స్వీట్ పెడితే నిరాకరించిన వధువు.. వరుడు ఏం చేశాడో చూడండి

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
