సమస్యే లేదు.. ఆమె లేనిది సినిమానే లేదు
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో దీపికా పదుకొనేను హీరోయిన్‌గా నటించి ఉండేది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఇంతలోనే ఈ సినిమా వార్తల్లోకి ఎక్కింది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ నుంచి దీపికను తప్పించాడని, దీపికనే తప్పుకుందని.. ఇలా రకరకాల కథనాలు వైరలయ్యాయి.
వీటితో పాటు స్పిరిట్ ఎఫెక్ట్ తో కల్కి 2898 AD సినిమా సీక్వెల్ కూడా దీపిక చేతుల్లోంచి వెళ్లిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రభాస్ ‘కల్కి 2898 AD’లో దీపికా పదుకొనే ఒక ప్రధాన పాత్ర పోషించింది. దీని సీక్వెల్ సెట్ కావడానికి కొంత సమయం పడుతుంది. అయితే దీపికకు ‘స్పిరిట్’ టీంతో ఇప్పటికే విభేదాలు ఉన్నందున, ప్రభాస్ ‘కల్కి 2’ కూడా దీపిక చేతుల్లోంచి వెళ్లిపోవచ్చునని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ‘కల్కి 2’ లో దీపికా పదుకొనే పాత్రకు చాలా ప్రాధాన్యముంది. రెండో పార్ట్ లో ఆమె రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉందనుందని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగం ఇప్పటికే విడుదలైంది కాబట్టి రెండవ భాగంలో దీపిక స్థానంలో మరో నటిని పెట్టడం సాధ్యం కాదు. కథలో కీలమైన పాత్ర కాబట్టి ఆమెను ఏ కారణం చేతనైనా ఈ మూవీ నుంచి తప్పించే అవకాశమే లేదు. అయితే కల్కి సీక్వెల్ సెట్ పై వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఒక బిడ్డకు తల్లి అయిన దీపికా పదుకొనే రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననడం, ఎక్కువ పారితోషికం కూడా అడగడంతో సందీప్ రెడ్డి వంగానే దీపికను తప్పించడని వార్తలు వచ్చాయి. అదే సమయంలో కంటెంట్ నచ్చకపోవడంతోనే దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందనే ప్రచారమూ జరుగుతోంది. మరి దీంట్లో ఏది నిజమనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ప్రేమే పొట్టన పెట్టుకుంది’ పాపం! హీరోయిన్ వెలుగొందాల్సింది.. శవమై కనిపించింది
నోటి దురుసు.. స్టార్ సింగర్ అయితే సరిపోదు.. సభ్యత ఉండాలి?
ప్రేమగా స్వీట్ పెడితే నిరాకరించిన వధువు.. వరుడు ఏం చేశాడో చూడండి

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ
