Manchu Lakshmi: వాళ్లు చాలా దురుసుగా ప్రవర్తించారు మంచు లక్ష్మి పోస్టులు వైరల్‌

Updated on: Jan 28, 2025 | 4:46 PM

ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఫైర్‌ అయ్యారు. ఇటీవల తాను ఇండిగో విమానంలో ప్రయాణించగా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తనపట్ల సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు. తన లగేజీ బ్యాగ్‌ను పక్కకు తోసేసినట్లు చెప్పారు.

బ్యాగ్‌ ఓపెన్‌ చెయ్యడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతి ఇవ్వలేదని మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్‌ను గోవాలోనే వదిలేస్తామని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్‌ అయ్యారు. తన కళ్లెదుటే సెక్యూరిటీ ట్యాగ్‌ కూడా వేయలేదని.. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్‌ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా..? అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు.? అంటూ నిలదీశారు. తనతోపాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా.. వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్లు ఎలాంటి సాయం చేయలేదని.. దీనికి కూడా ఏమైనా ప్రాసెస్‌ ఉందా..? అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్‌ చూస్తూ వరుస ట్వీట్లు చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Budget 2025: బడ్జెట్‌లో ఈ పదాలకు అర్థాలు తెలుసా ??

Budget 2025: బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది ??

Saif Ali Khan: సైఫ్‌ పై దాడి సమయంలో కరీనా కపూర్ పార్టీలో ఉన్నారా ?? మనుషుల తీరుపై హీరోయిన్ సీరియస్

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

బాబాయ్‌కి పద్మభూషణ్‌పై అబ్బాయిల రియాక్షన్‌