Mahesh-Trivikram movie: మహేష్ కోసం రూ.10 కోట్ల లగ్జరీ హౌస్ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్.. అదిరిపోయే అప్డేట్..
వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు అదే జోష్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది.
వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు అదే జోష్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మాణంలో ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై జనాల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి. ఇటీవలే ఈ చిత్ర తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.త్రివిక్రమ్-మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెకెండ్ షెడ్యూల్ షూటింగ్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ లగ్జరీ హౌస్ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. దీని కోసం ఏకంగా 10కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్‌లోనే జరగనుందని సమాచారం. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

