దేవుడి సినిమా దెబ్బకి చిత్తవుతున్న వార్ 2, కూలీ

Updated on: Aug 25, 2025 | 7:18 PM

కూలీ, వార్ 2.. ఈ రెండూ భారీ బడ్జెట్‌ సినిమాలే..! బిగ్ స్టార్స్‌.. సూపర్ స్టార్స్ నటించిన సినిమాలే..! కానీ ఈ రెండు సినిమాలు మహావతార్ నరసింహతో.. ఏమాత్రం పోటీ పడలేకపోతున్నాయి. టికెట్ బుకింగ్స్‌లో ఈ నరసింహుడి సినిమాకి ఈ భారీ చిత్రాలు.. ఆమడ దూరంలో నిలిచిపోయాయి. డైరెక్టర్ అశ్విన్ కుమార్ డైరెక్షన్లో.. హోంబలే ప్రొడక్షన్స్‌లో జులై25న రిలీజ్ అయిన మహావ్‌తార్ నరసింహ మూవీ.. రిలీజ్ రోజే థియేటర్లలో సూపర్ హిట్ అనిపించుకుంది.

నాటి నుంచి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 278 కోట్లపైగా కలెక్షన్స్‌ను సాధించింది. ఇంకా.. ఈ సినిమా టికెట్స్‌ రికార్డ్‌ రేంజ్‌లో తెగుతూనే ఉన్నాయి.. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్ ఫాంలో..! అది కూడా ఎంతలా అంటే వార్ 2, కూలీ సినిమా టికెట్స్‌ బుకింగ్స్‌ను మించేలా..! ఎస్ ! రిలీజ్ అయి దాదాపు నెల రోజులు అవుతున్నా.. మహావతార్ నరసింహ మూవీకి.. బుక్ మై షోలో గంటకు ఆరువేలకు పైగా టికెట్ల బుక్ అవుతున్నాయి. అదే యంగ్ టైగర్ , హృతిక్‌ రోషన్‌ యాక్ట్ చేసిన వార్ 2 మూవీ గంటకు జస్ట్ 3 వేలకు పైగా టికెట్లు మాత్రమే బుక్ అవుతున్నాయి. అదే రజినీ, నాగ్ యాక్ట్ చేసిన కూలీ సినిమాకు గంటకు 5 వేల టికెట్లు బుక్ అవుతున్నాయి. ఈ లెక్కన ఈ రెండు సినిమాలను మించేలా మహావతార్ నరసింహ స్టిల్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ సీన్‌లో లాజిక్కేది ?? వార్ 2పై RGV షాకింగ్ రివ్యూ

ఈ వయసులోనూ.. జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న మెగాస్టార్..!

చిరు ఫ్యాన్ అంటే అట్లుంటది.. గూస్‌‌బంప్స్‌ తెప్పిస్తున్న శ్రీకాంత్ ఓదెల ట్వీట్‌ !

జక్కన్న మెలిక ఇక.. కేమెరాన్ ఒప్పుకోక తప్పదుగా..

పది.. పాతిక కాదు.. లక్షల్లో సంపాదన.. పూసలమ్ముకునే బేబీ నయా దందా…!