బస్సు ఎక్కుతూ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ
మధాయనై కూట్టం, రావణ కొట్టం తదితర చిత్రాలతో కోలీవుడ్ లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సుకుమారన్ సోమవారం అంటే జూన్ 2 తెల్లవారుజామున కన్నుమూశారు. మధురై నుంచి చెన్నైకి వెళ్లేందుకు బస్సు ఎక్కుతండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. విక్రమ్ మరణ వార్త తెలుసుకున్న తమిళ సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం తెలిపింది.
పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విక్రమ్ కు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. డైరెక్టర్ ఆత్మకు శాంతి కలగాలని, ఈ కఠిన సమయంలో విక్రమ్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందించాలంటూ ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక విక్రమ్ సుకుమారన్ తమిళ సినిమా చరిత్రలోని ప్రముఖ దర్శకులలో ఒకరు. ఆయన ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా ‘ఆడుకలం’ సినిమాకు గానూ దర్శకుడు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత, ‘మధాయనై కూట్టం’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు విక్రమ్ సుకుమారన్ . ప్రముఖ నటుడు భాగ్యరాజ్ కుమారుడు శంతనుతో కలిసి రావణ కొట్టం మూవీని తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కేవలం డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా పొల్లాధవన్, కోడివీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు విక్రమ్. అయితే జూన్ 01న తన నెక్ట్స్ మూవీ స్టోరీని చెప్పేందుకు మధురై వెళ్లాడు ఈయన.ఈ క్రమంలోనే చెన్నై వచ్చేందుకు బస్సు ఎక్కారు. కానీ.. అలా ఎక్కుతుండగానే గుండెపోటు రావడంతో… కుప్పకూలిపోయాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దోష పరిహారమా ?? కామాఖ్య ఆలయంలో ఆషు రెడ్డితో.. పూజలు చేయించిన వేణుస్వామి
గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్ !!
విజయశాంతి ఎవరో కాదు.. రియల్ లైఫ్‌లో బాలయ్యకు కోడలు అవుతుంది
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

