Prabhas: ప్రభాస్ గురించి టాప్ సీక్రెట్స్ !!

Prabhas: ప్రభాస్ గురించి టాప్ సీక్రెట్స్ !!

Phani CH

|

Updated on: Oct 24, 2024 | 12:34 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిందే. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ప్రభాస్ బహుబలి సినిమాతో విదేశీయుల అభిమాన హీరో అయ్యాడు. ఇప్పుడు అరడజను సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అభిమానులు ఉన్న హీరో ప్రభాస్.

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ పేరు మారుమోగింది. కేవలం సినిమానే డార్లింగ్ ప్రపంచం. ఎవరి విమర్శలను పట్టించుకోడు.. కాంట్రవర్సీలకు ఆమడ దూరంలో ఉంటాడు. నవ్వుతూనే రెండు మాటలు మాట్లాతాడు తప్ప.. అనవసరమైన విషయాలను ప్రస్తావించడు. తన గురించి ఏవరేం మాట్లాడినా నవ్వుతూనే వదిలేస్తాడు.. ప్రతి ఒక్కరికి కడుపునిండా భోజనం అందించాలని చూస్తుంటాడు. వర్షం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి సినిమాతో మాస్ స్టార్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అప్పటివరకు లవర్ బాయ్‏గా కనిపించిన డార్లింగ్.. ఛత్రపతి తర్వాత మాస్ యాక్షన్ హీరోగా మారాడు. డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. జక్కన్న రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్, లుక్స్, రాజసం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ చిత్రంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దీంతో దేశమే కాదు.. పలు దేశాల్లోని సినీ ప్రియులు సైతం ప్రభాస్ కు వీరాభిమానులయ్యారు. ప్రభాస్ సినిమా వచ్చిందంటే విదేశాల్లోనూ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొన్న విజయవాడ.. నిన్న అనంతపురంవరద విలయం వెనుక కారణాలేంటి ??

TOP 9 ET News: సూర్య, అమీర్‌తో.. అల్లు అరవింద్ పాన్ ఇండియా సీక్వెల్

ప్రభాస్, సమంత ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదో తెలుసా ??

అప్పుడే పుట్టిన తన కూతురి కోసం కోట్లు పోసి లగ్జరీ కార్‌ కొన్న స్టార్ హీరో

విష్ణుకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ !! ఉన్న చోట ఉండక పుల్ల పెట్టిన యష్మి