హర్ట్ అయిన కన్నడ స్టార్ హీరో సుదీప్ వీడియో

Updated on: Dec 30, 2025 | 11:49 AM

కన్నడ స్టార్ హీరో సుదీప్ మార్క్ సినిమా ప్రమోషన్లలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నడ నటులు ఇతర భాషల్లో నటిస్తున్నా, ఇతర భాషల స్టార్లు తమ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గతంలో తెలుగులో నటించినా, ఇటీవల ఇతర భాషల సినిమాలకు దూరంగా ఉండటానికి ఇదే కారణమా అనే చర్చకు దారితీసింది.

కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇటీవల మార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కన్నడ నటులు ఇతర భాషల్లోని చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించడంపై సుదీప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఈగ, బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలతో సుపరిచితుడైన సుదీప్, ఆ తర్వాత ఇతర భాషా చిత్రాల్లో కనిపించడం మానేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉండటం వల్లే సుదీప్ ఇతర భాషల సినిమాలకు దూరంగా ఉన్నారని అభిమానులు భావించారు. అయితే, తన తాజా వ్యాఖ్యలతో అందుకు భిన్నమైన కారణం ఉందని సుదీప్ పరోక్షంగా సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో