ఆలియా ఫెయిలైతే.. కియారా క్లిక్ అయ్యారా ??
కెరీర్ స్పీడు మీదున్నప్పుడు కాసింత బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీని సెట్ చేసుకోవడం మామూలు విషయం కాదు. పక్కా ప్లానింగ్ కావాలి. ఈ విషయంలో సీనియర్లతో పోలిస్తే కియారా ది బెస్ట్ అనే మాట వినిపిస్తోంది. ఇంతకీ ఈ టాపిక్ ఎందుకొచ్చింది? ఆలియా పక్కా ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా ఆమె డిసైడ్ చేస్తే జరిగిపోవాల్సిందే. ఫ్యామిలీ, కెరీర్.. అన్నిట్లో సూపర్ అని అనుకున్నారు జనాలు.
కానీ, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అనే మాట వినిపిస్తోంది. ఆఫ్టర్ డెలివరీ ఏ ఇయర్‌లోనూ రిలీజ్‌ని మిస్ కాకూడదని అనుకున్నారు ఆలియా. ఈ ఏడాది డిసెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఆల్ఫా ఇప్పుడు వాయిదా పడింది. సో 2025ని ఆలియా మిస్ అయినట్టే. దీపిక కూడా ఈ ఏడాదిని మిస్ అయ్యారు. పోస్ట్ డెలివరీ కాస్త లేట్‌గానే సెట్లోకి అడుగుపెట్టారు దీపిక. ఇప్పుడు షారుఖ్ తో కింగ్ సినిమా చేస్తున్నారు. 2026లోనే ఇక దీపిక జనాల ముందుకు వచ్చేది. ఆలియా, దీపిక ఫెయిల్ అయిన చోట క్లిక్ అవుతున్నారు కియారా. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యారు కియారా. ఈ ఏడాది ఆమెకు గేమ్‌చేంజర్ రిలీజ్ అయింది. వార్2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫలితాల సంగతి పక్కనపెడితే కియారా ప్రయత్నం గ్రేట్ అంటున్నారు క్రిటిక్స్. వచ్చే ఏడాది కూడా గ్యాప్ లేకుండా టాక్సిక్‌తో ప్రేక్షకులను పలకరించనున్నారు ఈ లేడీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళకళలాడుతున్న షూటింగ్ స్పాట్‌లు.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా
థింక్ గ్లోబల్ అంటున్న జక్కన్న.. మహేష్ కోసం ఏం ప్లాన్ చేశారు
పాతవన్నీ థియేటర్లలో.. కొత్త సినిమాలు ఓటీటీల్లో
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

