నల్లగా ఉన్నావంటూ జోకులు.. ఇచ్చిపడేసిన డైరెక్టర్
‘జవాన్’ తో హిందీ చిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు కోలీవుడ్ దర్శకుడు అట్లీ . ప్రస్తుతం ఆయన ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. అట్లీ లుక్‌పై కపిల్ విమర్శలు చేస్తూ దర్శకుడిని అవమానించేలా వ్యవహరించాడు.
‘‘కథ చెప్పడం కోసం ఎవరినైనా స్టార్ హీరోను మీరు కలిసినప్పుడు.. వాళ్లు అట్లీ ఎక్కడ అని అడుగుతారా?’’ అని కపిల్ ప్రశ్నించాడు. అతడి మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకున్న అట్లీ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎందుకు ఈ ప్రశ్న తనను అడుగుతున్నారో తనకు అర్థమైందని చెప్పారు. ప్రశ్నకు సమాధానం ఒక్కటే అని.. టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది పెద్ద విషయం కాదనీ అట్లీ బదులిచ్చారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు తాను కృతజ్ఞతలు చెప్పాలన్నారు. తొలిసారి ఒక కథతో ఆయన వద్దకు వెళ్లినప్పుడు.. ఆయన కేవలం తన స్క్రిప్ట్ గురించే ఆలోచించారు తప్ప.. అట్లీ ఎలా ఉన్నాడు అని చూడలేదని తెలిపారు. తన కథపై నమ్మకం ఉంచి తన తొలి చిత్రానికి నిర్మాతగా చేశారు కాబట్టి, ప్రపంచం కూడా మన వర్క్‌నే చూడాలి. రూపాన్ని బట్టి మనల్ని అంచనా వేయకూడదు అని అట్లీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కపిల్ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. షోకు ఆహ్వానించి ఈ విధంగా అవమానించడం ఏమీ బాలేదని మండిపడుతున్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
MLAకు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం
ఇంటి తాళం చెప్పుల స్టాండ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..
33 గంటలు… నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం !! దీనివల్ల అమెరికన్లపై చాలా భారం