Kantara: కాంతార వరాహరూపం సాంగ్‌పై ఇంజెంక్షన్ ఆర్డర్.. కేరళ కోర్టు షాకింగ్ తీర్పు..
కాంతార చిత్రంలో సూపర్ హిట్ అయిన వరాహరూపం సాంగ్‌పై తాజాగా కేరళ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పదమైన వరాహరూపం పాటను .. థియేటర్లు, ఓటీటీ, డిజిటల్ స్ట్రీమింగ్‌లో వాడడం నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.
కాంతార చిత్రంలో సూపర్ హిట్ అయిన వరాహరూపం సాంగ్‌పై తాజాగా కేరళ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పదమైన వరాహరూపం పాటను .. థియేటర్లు, ఓటీటీ, డిజిటల్ స్ట్రీమింగ్‌లో వాడడం నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాపీరైట్ చట్టం ప్రకారం ఉల్లంఘన జరిగినట్లు కోర్టు తన ఇంజంక్షన్ ఆర్డర్‌లో పేర్కొంది. థియేటర్లు, ఓటీటీ, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో.. కాంతార చిత్రంలోని వరాహరూపం పాటను నిలిపివేయాలని కేరళ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ పాటపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. కాపీరైట్ చట్టం ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు చెప్పింది. ఫస్ట్ అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి కే ఈ సాలిహి ఈ ఆదేశాలు జారీ చేశారు. మ్యూజిక్ బ్యాండ్ తైకుడం బ్రిడ్జ్, మాతృభూమి ప్రింటింగ్‌కు వరాహరూపం పాట క్రెడిట్ ఇవ్వాలని కోర్టు తెలిపింది. నవరసం ట్రాక్ ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. నవరసం ట్రాక్‌ను కాపీ కొట్టి వరాహరూపం తీసినట్లు కోర్టు పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కాంతారా సినిమా రిలీజైన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి వరాహరూపం పాటపై కాపీరైట్ ఆరోపణలు ఉన్నాయి. తైకుడం బ్రిడ్జ్ రూపొందించిన నవరసం నుంచే ప్రేరణ పొంది వరాహరూపం పాటను క్రియేట్ చేసినట్లు మ్యూజిక్ డైరెక్టర్ అంగీకరించారని కోర్టు తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..