OTT: ఓటీటీ రూల్‌.. మన దగ్గర పని చేయదా

Edited By: Phani CH

Updated on: Oct 30, 2025 | 1:47 PM

ప్యాన్‌ ఇండియా కల్చర్‌ అన్నీ విషయాల్లోనూ రిఫ్లక్ట్ అవుతోంది. ఆ ఒక్క విషయంలో తప్ప అని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. ఏంటా ఒక్క విషయం? విజిబుల్‌ వేరియేషన్‌ ఎక్కడుంది? అని అంటారా? ఓటీటీల విషయంలోనే అండీ.. డీటైల్డ్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి. ఓ వైపు థియేటర్లలో సక్సెస్ ఫుల్‌ గా రన్‌ అవుతోంది కాంతార చాప్టర్‌ 1. ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.

ఆల్రెడీ 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీకి ఇంకాస్త స్కోప్‌ ఇస్తే వెయ్యికోట్లను దాటే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్‌ పండిట్స్. అయితే ముందుగా చేసుకున్న డీల్‌ ప్రకారమో, మరొకటో.. విషయం ఏదైనా ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. ఓజీ విషయంలోనూ ఇలాంటి సర్‌ప్రైజ్‌ అందుకున్నారు జనాలు. సినిమా విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురాకూడదన్నది నార్త్ లో ఉన్న రూల్‌. కానీ, మన దగ్గర ఆ పరిస్థితి లేదు. రిలీజ్‌ క్రేజ్‌ ఉన్నప్పుడే డిజిటల్‌ ప్లాట్‌పార్మ్స్ లో స్ట్రీమింగ్‌ మినిట్స్ జోరుగా ఉంటాయన్నది ఓటీటీల వ్యూ. అందుకే వీలైనంత త్వరగా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సౌత్‌లో ఈ విషయాన్ని దాటగలిగింది లోక మూవీ. విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ డేట్‌ పడింది. ముందే ఆ విధంగా మాట్లాడుకున్నారా? లేకుంటే సినిమా సక్సెస్ ఫుల్‌ రన్‌ చూపించి ఆపారా? అనే విషయం తెలియదుగానీ, కావాల్సినంత స్పేస్‌ని మాత్రం తీసుకోగలిగారు మేకర్స్. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన సినిమాల విషయంలో అయినా ఈ వెసులుబాటు ఉంటే మరిన్ని కాసులు చూసే అవకాశం ఉంటుందన్నది జనరల్‌ ఒపీనియన్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా

నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే

ఫిజికల్ అయిన పవన్‌, భరణి తీవ్ర గాయాలతో హౌస్‌ బయటకు భరణి..

ఆ డైరెక్టర్‌ పెళ్లికి అదిరిపోయే సర్‌‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

ఆమెకు నోటి దురుసు.. వీళ్లద్దరికీ ప్రేమ ముసుగు! ఈసారి దిమ్మతిరిగే ఎలిమినేషన్‌

Published on: Oct 30, 2025 01:44 PM