Indian 2 Review: హిట్టా.? ఫట్టా.? 28 ఏళ్ళ తరువాత మ్యాజిక్ భారతీయుడు 2 రివ్యూ..
భారతీయుడు అనేది ఓ సెన్సేషన్. 28 ఏళ్ళ కింద శంకర్ నుంచి వచ్చిన ఈ అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేసారు ఈ దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. నాటి భారతీయుడును మరిపిస్తుందా..? అసలు ఇప్పటి సేనాపతి ఎలా ఉన్నాడు అనేది ఈ రివ్యూలో చూద్దాం.. చిత్ర అరవిందన్ అలియాస్ సిద్ధార్థ్ తన స్నేహితులతో కలిసి సమాజంలో జరుగుతున్న అవినీతిపై పోరాడుతుంటాడు. సోషల్ మీడియాలో తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటాడు.
భారతీయుడు అనేది ఓ సెన్సేషన్. 28 ఏళ్ళ కింద శంకర్ నుంచి వచ్చిన ఈ అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేసారు ఈ దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. నాటి భారతీయుడును మరిపిస్తుందా..? అసలు ఇప్పటి సేనాపతి ఎలా ఉన్నాడు అనేది ఈ రివ్యూలో చూద్దాం..
చిత్ర అరవిందన్ అలియాస్ సిద్ధార్థ్ తన స్నేహితులతో కలిసి సమాజంలో జరుగుతున్న అవినీతిపై పోరాడుతుంటాడు. సోషల్ మీడియాలో తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటాడు. ఆ వీడియోలు చూసి జనం కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. వాటితోనే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తాడు చిత్ర. కానీ ఎంత చేసినా.. జనంలో మార్పు రాకపోగా నానాటికి మరింత దారుణంగా మారిపోతుంది సమాజం. ఇలాంటి సమయంలో మళ్లీ ఈ దేశాన్ని బాగు చేయాలంటే భారతీయుడు రావాలని.. కమ్‌బ్యాక్ ఇండియన్ పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తారు చిత్ర. ఈ క్రమంలోనే సర్‌ప్రైజింగ్‌లీ సేనాపతి మళ్లీ ఇండియాకు తిరిగొస్తాడు. వచ్చీ రాగానే అన్యాయం చేస్తున్న వాళ్లు, అవినీతికి పాల్పడుతున్న పెద్ద తిమింగళాలను పట్టుకుని.. తనకు తెలిసిన వర్మ కళను ఉపయోగించి చంపేస్తుంటాడు. ముందు సేనాపతి మాటలకు బ్రెయిన్ వాష్ అయిన చిత్ర అండ్ గ్యాంగ్.. ఆ తర్వాత తమకు జరిగిన అన్యాయాలకు కారణం భారతీయుడే అని తెలుసుకుంటారు. దాంతో గో బ్యాక్ ఇండియన్ అని ట్రెండ్ చేస్తారు. అప్పుడేమైంది.. అసలు దేశం కోసం ఇంత కష్టపడిన సేనాపతిని వాళ్లెందుకు దేశం నుంచి పొమ్మన్నారు అనేది అసలు కథ..
సముద్రంతో సెల్ఫీ దిగిన తర్వాత పిల్లకాలువ పక్కన నిలబడి ఫోజ్ ఇస్తే ఎలా ఉంటుంది..? భారతీయుడు ఇంపాక్ట్ భారతీయుడు 2 మీద అలాగే ఉంది. 28 ఏళ్ళ కింద వచ్చిన భారతీయుడు ఇప్పటికీ ప్రేక్షకులకు అలాగే గుర్తుండిపోయిందంటే అందులో ఉన్న కంటెంట్ కారణం. కానీ ఇప్పుడు సీక్వెల్‌లో మాత్రం బాహుబలి ఇంటర్వెల్ లో రానాను డామినేట్ చేసే ప్రభాస్ విగ్రహంలా.. సినిమా అంతా నాటి సేనాపతి.. నేటి సేనాపతిని డామినేట్ చేస్తూనే ఉన్నాడు. భారతీయుడు లాంటి సినిమాకు సీక్వెల్ అంటేనే సాహసం. అది రిస్క్ అని తెలిసినా చేశాడు శంకర్. ఓ అద్భుతం చూసాక.. మళ్ళీ అది సృష్టించడం శంకర్ వల్ల కూడా కాదు. భారతీయుడు అనేది ఓ ఎమోషన్. పైగా లంచం, అవినీతిపై ఎక్స్ పోజర్ ఈ స్థాయిలో లేదప్పుడు. అప్పట్లో అది భీభత్సంగా కనెక్ట్ అయింది. ప్రతీ సీన్ కూడా కొత్తగా అనిపించింది.. ఏం చేసినా అద్భుతం అన్నారు ఆడియన్స్ కూడా. కానీ సీక్వెల్ లో ఆ ఎమోషన్ మిస్ అయింది. ఎందుకంటే ఇంతకుమించిన అవినీతిని రోజూ టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. వాళ్లకు కొత్తగా అనిపించే సీన్స్ ఏవైనా భారతీయుడు 2లో ఉంటే చూడ్డానికి కూడా కొత్తగా ఉండేది. కానీ శంకర్ ను ముందు నుంచి ఇబ్బంది పెట్టిన విషయం కూడా ఇదే. దీన్ని ఓవర్ కమ్ చేయడంలో ఈయన కూడా తడబడ్డాడు. స్క్రీన్ ప్లే కూడా అపరిచితుడు సినిమాను గుర్తు చేస్తుంది. అక్కడ విక్రమ్‌ను పట్టుకోడానికి సినిమా అంతా వివేక్‌ను వెంటేసుకుని ప్రకాశ్ రాజ్ తిరుగుతుంటాడు.. ఇక్కడ కూడా అదే వివేక్‌తో బాబీ సింహా ఉంటాడు. కొన్ని శంకర్ మార్క్ సీన్స్ ఉన్నాయి.. ముఖ్యంగా సేనాపతి తిరిగొచ్చే సీన్ అదిరింది. ఇంటర్వెల్ బాగుంది.. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్.. కానీ మిగిలిన రొటీన్ సీన్స్ కారణంగా ఇవి హైలైట్ అవ్వలేదు.. 2024లో భారతీయుడు తిరిగొస్తే ఆయనకు కూడా చుక్కలు తప్పవని సినిమాలో చూపించాడు శంకర్. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ కష్టాలు తప్పకపోవచ్చు. కమల్ చెప్పినట్టు పార్ట్ 3 ఆసక్తికరంగా ఉండబోతుందని క్లైమాక్స్ లో చూపించిన షో రీల్ చూస్తే అర్థమైంది. అసలు సేనాపతి ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చాడు.. వీరశేఖరన్ సేనాపతి అనే వ్యక్తి బ్రిటీష్ వాళ్లపై ఎలా పోరాటం చేసాడు అనేది మూడో భాగంలో చూపించబోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.