Kamal Haasan: కమల్ లుక్‌ రిలీజ్‌.. అదిరిన ఇండియన్ 2 పోస్టర్.. లెంత్ పెరిగిన సినిమా..

Updated on: Nov 10, 2022 | 8:39 PM

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇండియన్ 2. అనివార్య కారణాలతో రెండేళ్ల క్రితమే నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల తిరిగి ప్రారంభమయ్యింది. ఈ సినిమాతో టాలీవుడ్ చందమామ కాజల్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.


విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇండియన్ 2. అనివార్య కారణాలతో రెండేళ్ల క్రితమే నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల తిరిగి ప్రారంభమయ్యింది. ఈ సినిమాతో టాలీవుడ్ చందమామ కాజల్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తుంది. నవంబర్ 7న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి కమల్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ క్యూరియాసిటిని పెంచేసింది. తాజా పోస్టర్ లో సేనాపతి పాత్రలో కనిపిస్తున్నారు కమల్. అందులో ఫుల్ అగ్రెసివ్ గా కనిపించారు. ప్రస్తుతం రిలీజ్ అయిన భారతీయుడు 2 పోస్టర్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రన్ టైమ్ 3 గంటలకు పైనే ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 10, 2022 08:39 PM