Prabhas – Kalki 2898 AD: కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్ దెబ్బ.!

|

Jul 01, 2024 | 8:36 AM

బ్యాక్‌ టు బేసిక్స్ అన్నట్టు.. బ్యాక్‌ టు భారత, బ్యాక్‌ టు రామాయణం, మహాభారతం అంటూ వెనక్కే చూస్తున్నారు మన సినిమావాళ్లు. దేవుళ్లే కథావస్తువులుగా… పురాణాలే పంచభక్ష్య పరమాణ్ణాలుగా మారి.. ప్రేక్షకుడికి పసందైన వినోదాన్ని ఇస్తున్నారు. దానికితోడు ఆడియన్స్‌ ఇప్పుడు సినిమాను చూసే తీరు మారింది. ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు పురాణాల్ని తెరమీద రీప్రొడ్యూస్ చేయడం మొదలైంది.

బ్యాక్‌ టు బేసిక్స్ అన్నట్టు.. బ్యాక్‌ టు భారత, బ్యాక్‌ టు రామాయణం, మహాభారతం అంటూ వెనక్కే చూస్తున్నారు మన సినిమావాళ్లు. దేవుళ్లే కథావస్తువులుగా… పురాణాలే పంచభక్ష్య పరమాణ్ణాలుగా మారి.. ప్రేక్షకుడికి పసందైన వినోదాన్ని ఇస్తున్నారు. దానికితోడు ఆడియన్స్‌ ఇప్పుడు సినిమాను చూసే తీరు మారింది. ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు పురాణాల్ని తెరమీద రీప్రొడ్యూస్ చేయడం మొదలైంది. కొత్త కథల్లేక కరువులో ఉన్న క్రియేటివ్ పీపుల్‌ని ఈవిధంగా పురాణ కథలే ఆదుకుంటున్నాయి. పురాణాల ప్రస్తావనలతోనే తమతమ సినిమాల్లో క్యారెక్టర్లను కొత్తగా డిజైన్ చేసుకుంటున్నారు దర్శకులు. ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైంది. కల్కి కూడా అలాగే వచ్చి.. ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

కొత్త జనరేషన్ దర్శకులు కూడా ఎక్కువగా మైథాలజీ కథలపైనే ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల తెరకెక్కి సౌత్‌ అండ్ నార్త్‌ అదరగొట్టిన హనుమ్యాన్.. అలా పుట్టుకొచ్చిందే. హనుమంతుడి అమరత్వం కాన్సెప్టుని వాడుకుని.. సోషియో ఫాంటసీ తీసి ఒక అద్భుతాన్నే సృష్టించాడు ప్రశాంత్ వర్మ. అదే మూవీలో విభీషణుడి పాత్రను కూడా చక్కగా పిక్చరైజ్ చేసుకున్నాడు. పౌరాణిక పాత్రల వాడకంలో ప్రశాంత్ వర్మ చూపించిన మెథడాలజీని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు కల్కి సినిమాకు మూలం కూడా మహాభారత కథే. అశ్వద్ధామ అమరత్వాన్ని ఆధునిక ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పి.. వావ్ అనిపించాడు డైరెక్టర్ నాగీ. కల్కి ఫ్రాంచైజీలో వచ్చిన తొలి భాగమే వెయ్యికోట్ల వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. సినిమాటిక్ యూనివర్స్‌ కమింగ్ సూన్‌.. అని సినిమా చివర్లో హింట్ ఇచ్చిన నాగీ.. ఫ్యూచర్ సినిమాకు ఒక మంచి చిట్కాను ప్రసాదించేశాడు. సో.. పౌరాణిక సినిమా అప్‌డేటెడ్ వెర్షన్స్‌ క్యూకట్టబోతున్నాయ్ అన్నమాట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.