ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్నా.. నెలకు 7 లక్షల సంపాదన! ఎలా అంటే ??

Updated on: Nov 29, 2025 | 4:00 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన కాజోల్ సినిమాలు తగ్గించినా, ప్రతి నెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ముంబైలోని ఆమె వాణిజ్య ఆస్తిని HDFC బ్యాంక్‌కు అద్దెకివ్వడం ద్వారా ఇది సాధ్యమవుతోంది. 9 సంవత్సరాలకు మొత్తం 8.6 కోట్ల రూపాయలు వస్తాయి, అంటే నెలవారీ సుమారు 6.9 లక్షలు. ఎటువంటి శ్రమ లేకుండానే ఈ నిష్క్రియాత్మక ఆదాయం ఆమె బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది.

బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న కాజోల్.. ఇప్పుడు సినిమాలు దాదాపు తగ్గించేసింది. కానీ ఆమె బ్యాంక్ అకౌంట్ మాత్రం ఖాళీ కావడం లేదు… బదులుగా ప్రతి నెలా లక్షల రూపాయలు జమ అవుతూనే ఉన్నాయి. అది కూడా ఏం చేయకుండానే. హీరోయిన్ కాజోల్‌కు ముంబయిలో బ్యాంక్ స్ట్రీట్ పక్కనే భారీ కమర్షియల్ ప్రాపర్టీ ఉంది. ఆ భవనంలోని రిటైల్ స్పేస్‌ను భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్‌కు రెంట్‌కు ఇచ్చింది. ఒప్పందం ప్రకారం 9 ఏళ్లలో ఆమెకు మొత్తం 8.6 కోట్ల రూపాయలు వస్తాయి… అంటే సగటున ప్రతి నెలా సుమారు 6.9 లక్ష రూపాయలు! ఒక్క రోజు కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు, కెమెరా ముందు నటించాల్సిన అవసరం లేదు, ఎడిటర్‌తో గొడవ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ, బ్యాంక్ నుంచి వచ్చే SMSలు చూస్తూ ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టేయడమే. కాజోల్ పని బాగుంది కదూ..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??

ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్‌ మిస్‌ అవుతుంది జాగ్రత్త !!

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌