Devara - NBK 109: బాబాయ్‌ vs అబ్బాయి.. బాలయ్యకు ఎదురెళుతున్న యంగ్ టైగర్.!

Devara – NBK 109: బాబాయ్‌ vs అబ్బాయి.. బాలయ్యకు ఎదురెళుతున్న యంగ్ టైగర్.!

Anil kumar poka

|

Updated on: Feb 18, 2024 | 12:56 PM

దేవర సినిమా వాయిదాపై క్లారిటీ వచ్చేసింది. చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే.. ఎప్రిల్ 5 నుంచి ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ అయిపోయింది దేవర. సమ్మర్ సీజన్ మిస్ చేసుకున్నా.. సాలిడ్ సీజన్‌పై కన్ను వేసారు తారక్. దసరాకు దేవర విడుదల కానున్నట్లు ఖరారు చేసారు మేకర్స్. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల చేస్తామంటూ అనౌన్స్ చేశారు. దీంతో బాలయ్యకు ఎదురెళుతున్నట్లు అయింది యంగ్ టైగర్ ఎన్టీఆర్.

కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. దేవర వాయిదాకు చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి. అందులో మొదటిది.. అందరూ హైలైట్ చేస్తున్నది ఏపీ ఎన్నికలు. ఆ సమయంలో దేవరను తీసుకొస్తే.. లేనిపోని ఇబ్బందులు అన్నట్లు ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు అనిరుధ్ ఇప్పటి వరకు ఒక్క పాట కూడా ఇవ్వలేదు.. దాంతో షూట్ కూడా అవ్వలేదు. మరోవైపు టాకీ కూడా ఇంకా నడుస్తూనే ఉంది. అందుకే వాయిదా వేసుకోవడమే మంచిదని నిర్ణయించారు మేకర్స్. దసరా అక్టోబర్ 12 అయితే.. దానికి రెండ్రోజుల ముందే వచ్చేస్తుంది దేవర.

అయితే బాలయ్య, బాబీ సినిమా కూడా దసరాకే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో దసరాకే భగవంత్ కేసరితో వచ్చి హిట్ కొట్టారు బాలయ్య. అదే సెంటిమెంట్ బాబీ సినిమాకు అప్లై చేయాలని చూస్తున్నారు. ఇదే జరిగితే బాబాయ్, అబ్బాయ్ వార్ తప్పదు. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ కూడా ఒకేరోజు గ్యాప్‌లో 2016 సంక్రాంతికి వచ్చాయి. ఈసారి దసరాకు సీన్ రిపీట్ అయ్యేలా కనిసిస్తుంది. మొత్తానికి చూడాలిక.. దేవరతో NBK 109 పోరు ఎలా ఉండబోతుందో..?

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..